జ్యూస్ తాగుదామని బాటిల్ లో నాలుక పెట్టాడు,తీరా ఏమైందంటే

పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు,ఎక్కడ బడితే అక్కడ తల దూర్చకూడదు, దేనిలో పడితే దానిలో వేలు పెట్టకూడదు అని.

అయితే ఇప్పుడు తాజాగా దేనిలో కూడా నాలుక దూర్చకూడదు అన్న విషయం ఈ తాజాగా ఉదంతం గురించి తెలుసుకుంటే అర్ధం అవుతుంది.

ఒక చిన్న పిల్లాడి తాపత్రయం ఎంతటి పరిణామాలకు దారితీసిందో తెలియాలి అంటే జర్మనీ లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.వివరాల్లోకి వెళితే.

జర్మనీలోని హెనోవెర్‌లో ఒక బాలుడు ఇంట్లో ఉన్న జ్యూస్ బాటిల్ అడుగున ఒక్క చుక్క మిగిలివుంది.అయితే దానిని చూసి ఆ ఒక్క చుక్క తాగాలని ఆత్రంగా పోయి తన నాలుకను బాటిల్ లోకి దూర్చాడు.

అంతే ఆ బాటిల్ లోని గాలి బయటకు వెలువడడం తో ఆబాలుడి నాలుక బాటిల్ లో ఇరుక్కుపోయింది.దీనితో ఆ బాలుడు తన నాలుక బాటిల్ లో ఇరుక్కుపోయింది అని గగ్గోలు పెడుతూ తన తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నాడు.

Advertisement

అయితే ఆ బాలుడి తల్లి దండ్రులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నాలుక మాత్రం బయటకు లాగలేకపోయారు.దీనితో చేసేది ఏమీ లేక ఆ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించారు.

అయితే పరిస్థితి గమనించిన వైద్యులు వెంటనే ఆ బాలుడికి చాకచక్యం గా ఆ బాటిల్ లో ఏర్పడిన వాక్యూమ్ ను తొలగించడానికి ఇంజెక్షన్ సిరెంజి లో గాలిని నింపి వినియోగించడం తో మొత్తానికి ఆ పిల్లాడి నాలుక బాటిల్ నుంచి బయటకొచ్చింది.దీనితో అటు పిల్లాడి తల్లిదండ్రులు,అలానే వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే చాలా సేపు బాటిల్ లో నాలుక ఇరుక్కున్న కారణంగా ఆ బాలుడి నాలుక నీలం రంగులోకి మారిపోయింది.బాటిల్ లో నుంచి నాలుకను బయటకు తీసిన వైద్యులు మరో కొద్దీ గంటల పాటు ఆ బాలుడిని తమ రక్షణలోనే ఉంచుకొని వైద్యం అందించినట్లు తెలుస్తుంది.దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడ బడితే అక్కడ వేలే కాదు నాలుక కూడా పెట్టకూడదు అన్నమాట.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు