ఈ బామ్మ ఇప్పుడే ఇన్ని సాహసాలు చేస్తోంది.. వయసులో ఉన్నప్పుడు ఇంకా ఏమేం చేసిందో!

చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి.అయితే చిన్నప్పటి నుంచే మన మదిలో కొన్ని లక్ష్యాలు ఉన్నప్పటికీ.

పలు కారణాల వాటిని నెరవేర్చుకోలేకపోతుంటాం.అయితే చనిపోయేలోపు అయినా సరే ఆ కోరికలను తీర్చుకోవాలనకుుంటాం.

అందుకోసం వయసుతో సంబంధం లేకుండా కష్టపడతాం.వయసు మీరిన తర్వాత కూడా అలా అనుకొని చదువుకున్న వాళ్లు.

తమకు నచ్చిన రంగాల్లో రికార్డులు సృష్టించిన వారు కోకొల్లలు.అయితే తాజాగా ఓ ఏడుపదులు వయసున్న బామ్మ కూడా ఇలాగే చేసింది.

Advertisement

యువకులు చేస్తున్న విన్యాసాలను చూసి.ఆమె కూడా అందులో భాగం అయింది.

ఏఎవరూ ఉహించని రీతిలో విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.హరియాణాకు చెందిన ఈ బామ్మ.

ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని హర్ కీ పౌడీ ఘాట్ వంతెనపై నుంచి గంగా నదిలో దూకి. సునాయసంగా ఒడ్డుకు చేరుకుంది.

ఈ సమయంలో వంతెన పైనుంచి నదలో దూకుతున్న యువకులను చూసి ఉత్సాహంతోనే ఆమె ఇలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి డైవ్, స్విమ్మింగ్ చేయడం ఇష్టమని వారు వివరించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

అందుకే ఈ వయసులోని ఆమె సునాయసంగా ఇలాంటి అద్భుతం సృష్టించిందని పేర్కొన్నారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఏడు పదుల వయసులోనూ బామ్మ చేసిన ఈ విన్యాసాలు చూడ ముచ్చటగా ఉన్నాయంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఈ ఏజే లోనే ఇన్ని సాహసాలు చేస్తున్న ఈమె.వయసులో ఉన్నప్పుడు ఇంకా ఎన్నెన్ని విన్యాసాలు చేసిందో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తాజా వార్తలు