మునుగోడు ఉపఎన్నికల వేళ పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది.శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ఓ వాహనంలో రూ.70 లక్షల నగదును గుర్తించారు.అయితే ఆ మొత్తానికి సంబంధించిన రసీదు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.నగదును తరలిస్తున్న వాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఇక మరో ఆరు రోజుల్లో ఉపఎన్నిక పోలింగ్ జరుగనున్న మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో భారీగా నగదు లభించింది.మండలంలోని అంతారం గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ.5.60 లక్షలు పట్టుబడ్డాయి.దీంతో నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




తాజా వార్తలు