అమెరికన్ డాలర్లను పక్కనబెట్టి రూపాయి వైపు మొగ్గు చూపుతున్న 64 దేశాలు.. మోడీనా మజాకానా!

మీరు ఇక్కడ చదివింది నిజమే.మోడీ( Narendra Modi ) ఏ ముహుర్తమున ప్రధాని అయ్యాడో గానీ, అప్పటినుండి భారత్ పేరు దేశదేశాల్లో మారుమ్రోగిపోతోంది.

కరోనా వంటి ప్రమాదకరమైన విపత్తులను ఒడ్డి కూడా దేశ స్థితిగతులను సమం చేసాడంటే అది ఒక్క మోడీకే చెల్లింది.ఈ క్రమంలోనే ప్రపంచ వేదికపై భారతదేశం ప్రభావం రోజు రోజుకు పెరుగుతోందని చెప్పుకోవాలి.

మరీ ముఖ్యంగా వాణిజ్య రంగంలో పెరుగుతున్న భారత్ ఆధిపత్యం కారణంగా, ఇప్పుడు అనేక దేశాలతో భారత్ రూపాయి కరెన్సీలో వాణిజ్యం చేస్తోంది.

తాజాగా భారతదేశం, మలేషియా( Malaysia )తో నేరుగా భారతీయ కరెన్సీ అంటే రూపాయిలో వ్యాపారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత సంవత్సరం, భారతీయ రిజర్వ్ బ్యాంక్( Reserve Bank of India ) అంతర్జాతీయ వ్యాపారం కోసం రూపాయిని ఉపయోగించుకోవడానికి అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇరు దేశాల మధ్య ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది.

Advertisement

మిగిలిన కరెన్సీలాగే ఇప్పుడు భారతీయ రూపాయి కూడా 2 దేశాల మధ్య వాణిజ్యానికి ఉపయోగిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, MEA తాజాగా తెలిపింది.

ఈ విధంగానే రష్యా, శ్రీలంక తర్వాత 4 ఆఫ్రికన్ దేశాలతో సహా చాలా దేశాలు భారత్‌తో అతి త్వరలో రూపాయల్లో వ్యాపారం చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి.ఇప్పటి వరకు భారతదేశంలో 17 వొస్టరో ఖాతాలు తెరుచుకున్నట్టు భోగట్టా.ఇతర దేశాలతో రూపాయి మారకంతో వ్యాపారం చేయడానికి ఈ ఖాతా అనేది తప్పనిసరి.

ఇదొక్కటే కాదు, జర్మనీ-ఇజ్రాయెల్‌తో సహా 64 దేశాలు భారత్‌తో రూపాయలలో వాణిజ్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నాయి.ఇక 30 దేశాలతో భారత్ వ్యాపారం రూపాయితో ప్రారంభమైతే, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారుతుంది.

తద్వారా విదేశీ వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం తీసుకున్న చర్యలు విజయం సాధిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు