కేవలం ఆ ఒక్క ప్రాంతం లోనే 60 కోట్లు..'జైలర్' రికార్డు ని అందుకోవడం మన హీరోలకు అసాధ్యమే!

రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్( jailer ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో , వర్కింగ్ డేస్ లో కూడా గంటకి సగటున 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

వీకెండ్స్ లో కాకుండా వర్కింగ్ డేస్ లో ఒక సినిమాకి ఈ స్థాయి టికెట్స్ అమ్ముడుపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు.సూపర్ స్టార్ సినిమాకి ఒక మోస్తారు టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో మోతెక్కిపోతుందో, ఇది ఒక ఉదాహరణ అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఆయనకీ ఇంత క్లీన్ సూపర్ హిట్ సినిమా వచ్చి దాదాపుగా 8 ఏళ్ళు అయ్యింది.శంకర్( Shankar ) తో తీసిన 2 పాయింట్ O కూడా కమర్షియల్ గా ఎబోవ్ యావరేజి గా నిల్చింది.

తెలుగు లో కూడా ఇదే పరిస్థితి, ఆయనకీ హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది, అలాంటి సందర్భం లో ఈ జైలర్ చిత్రం డబ్బులు పెట్టి కొన్న ప్రతీ బయ్యర్ కి పదింతలు లాభాలను తెచ్చిపెట్టింది.కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.త్వరలోనే ఈ చిత్రం రజినీకాంత్ హైయెస్ట్ తెలుగు దబ్ గ్రాసర్ రోబో సిరీస్ వసూళ్లను అధిగమిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 650 కోట్ల రూపాయిలు వసూలు చేస్తుందని అనుకుంటున్నారు.కేవలం ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమా కేవలం కర్ణాటక ప్రాంతం నుండి 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.కన్నడ ( Kannada )చిత్రాలకే అక్కడ ఈ స్థాయి వసూళ్లు ఎప్పుడో 5 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయి.అలాంటిది రజినీకాంత్ కి అవలీల గా వచ్చేసాయి అంటే ఆయన రేంజ్ కారాన్తక ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ వసూళ్లు ఇంత స్థాయిలో రావడానికి ఈ చిత్రం లో గెస్ట్ రోల్ చేసిన శివ రాజ్ కుమార్( Siva Rajkumar ) కూడా ఒక భాగం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.మన టాలీవుడ్ హీరోస్ కి కర్ణాటక( Karnataka ) లో ఈ స్థాయి మార్కెట్ అయితే లేదు.

ఇప్పటి వరకు ఇక్కడ బాహుబలి చిత్రం మాత్రమే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది, గత ఏడాది విడుదలైన #RRR చిత్రం కూడా 84 కోట్లు మాత్రమే వసూలు చేసింది, కానీ రజినీకాంత్ కేవలం నార్మల్ కమర్షియల్ మూవీ తో రికార్డ్స్ ని బద్దలు కొట్టేసాడు .

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు