రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress party )సంచలన విజయం ని నమోదు చూసుకొని దాదాపుగా 69 స్థానాలను గెలుచుకుంది.ఇది సాధారణమైన విషయం కాదు, కానీ హైదరాబాద్ లో మాత్రం ఒక్కటంటే ఒక్క స్థానం లో కూడా గెలవకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.
ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కచ్చితంగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అనుకున్నారు.మొన్న హై కమాండ్ నుండి కూడా రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చింది.
నిన్న హైదరాబాద్ లోని LB స్టేడియం లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేద్దాం అనుకున్నారు.కానీ ఉత్తమ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చెయ్యడం తో ఈ కార్యక్రమం ఆగింది.
కాంగ్రెస్ తరుపున గెలిచినా 69 మందిలో 40 మంది రేవంత్ రెడ్డి కి సపోర్టుగా ఉన్నారు.
మిగిలిన 29 మందిలో 17 మంది ఉత్తమ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) కి సపోర్టుగా ఉన్నారు.మిగిలిన వాళ్ళు న్యూట్రల్ ఒపీనియన్ తో ఉన్నారు.ఇలా అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ లో చర్చలు రావడం వల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
మరోపక్క రేవంత్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున తెలంగాణ సెక్రటేరియేట్ కి చేరుకొని మా నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.ఒక్క మాట లో చెప్పాలంటే తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు రేవంత్ రెడ్డి చేసిన కృషి, పడిన కష్టం మామూలుది కాదు.
ఆయన వల్లే పార్టీ అధికారం లోకి వచ్చింది.కాబట్టి ఆయనకీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే సబబు.ఒకవేళ అలా జరగకపోతే రేవంత్ రెడ్డి కి సపోర్టుగా ఉన్న 40 మంది రాజీనామా చెయ్యడానికి సిద్ధం గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం కాంగ్రెస్ పని ఇక అవుట్ అని చెప్పొచ్చు.ఎందుకంటే తన మద్దతు దారులైన 40 మంది ఎమ్యెల్యే లతో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టొచ్చు.మన ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ చేసింది కూడా ఇలాంటి పనియే.
ఫలితంగా ఆంధ్ర లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది.మళ్ళీ అలాంటి పొరపాటు తెలంగాణ లో కూడా చేస్తే ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయ్యినట్టే.
కాబట్టి రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, మరి ఈరోజు ఏమి జరగబోతుందో చూడాలి.