బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ లో అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )గెలిచాడు అని తెలియడంతో స్టూడియో బయట విధ్వంసం సృష్టించారు అభిమానులు.
సంతోషంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మిగిలిన సెలబ్రిటీల కార్ల అద్దాలు బస్సుల అద్దాలు అన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు.దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైల్ కు తరలించిన విషయం తెలిసిందే.అయితే దీనిపై కొందరు స్పందిస్తూ పల్లవి ప్రశాంత్ కు తగిన శాస్త్రి చేశారు అని నెగటివ్ గా స్పందిస్తుండగా,మరికొందరు తన తప్పేమీ లేదు అంటూ పాజిటివ్ గా స్పందించారు.

ఇకపోతే పల్లవి ప్రశాంత్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా ఎట్టకేళకు నిన్ననే నాంపల్లి కోర్టు( Nampally Court ) తీర్పు వెల్లడించింది.మొత్తానికి కండీషన్స్ తో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.దీంతో పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాసాడు.తాజాగా నిన్న రాత్రి విడుదల అయ్యి బయటికీ వచ్చాడు ప్రశాంత్.దీంతో అతని కోసం అభిమానులు జైలు ముందు ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో హృదయం చలించే ఘటన ఒకటి జరిగింది.
పల్లవి ప్రశాంత్ కోసం నాలుగేళ్ల చిన్నారని జైలు బయట వేచి ఉండటం అందరి దృష్టిని మళ్లించింది.

తన మామ కోసం వేచి ఉన్నానని, బయటికి రాగానే రెండు చాక్లెట్స్ ఇస్తానని చెప్పింది.తన మామ కోసమే ఇక్కడికి వచ్చానని చిన్నారి చెప్పడం గుండెలను కదిలిస్తోంది.కొంతమంది అందుకు సంబంధించిన దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించి వెంటనే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే ఆ చిన్నారికీ జ్వరం కూడా వచ్చిందని, అయినా కూడ ప్రశాంత్ లాసం వాళ్ల అమ్మ, అమ్మమ్మతో కలిసి జైలుకు వచ్చిందట.ప్రశాంత్ మామను చూడాలి అంటూ వెక్కివెక్కి ఏడ్చిందంట.
ప్రస్తుతం ఈ చిన్నారి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తనను బయటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులతో పాటు పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో బెయిల్ మంజూరైంది.
కాగా పల్లవి ప్రశాంత్ కు మద్దతుగా పలువురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు నిలిచారు.