టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల( Roshan kanakala ) హీరోగా నటించిన తాజా అవుతున్న బబుల్‌గమ్.ఈ మూవీకీ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.అయితే ప్రస్తుతం గత కొద్దిరోజులుగా మావి మేకర్స్ ప్రొమోషన్స్ లో బాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
కాగా ఇదే రోజు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ మూవీ( Devil movie ) కూడ కూడా విడుదల కానుంది.అంతేకాదు సలార్ సినిమా విడుదలై అప్పటికి వారం రోజులే అవుతుంది.

మరి అంతపెద్ద సినిమా ఉన్నప్పుడు మీ సినిమా విడుదల చేయడానికి భయం వేయడం లేదా అని అడిగితే దర్శకుడు రవికాంత్ పేరేపు( Ravikant ) అదిరిపోయే సమాధానం ఇచ్చారు.సలార్( Salaar ) మూవీలో లేనిది మా సినిమాలో ఉంది అంటూ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ. సలార్‌లో లేనిది మా సినిమాలో ఉంది.మా సినిమాలో లేనిది సలార్‌లో ఉంది.మా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా బజ్ వచ్చింది.
అలాగే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ బజ్ ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని భావించాము.
ఈ బజ్ తగ్గట్టే సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.

సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్‌గా ఉంటాయి.ప్రేక్షకులని బలంగా హత్తుకుంటాయి అని చెప్పుకొచ్చారు దర్శకుడు రవికాంత్ పేరేపు.కాగా సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
ఇక అందులో భాగంగానే తాజాగా దర్శకుడు రవికాంత్ మీడియాతో ముచ్చటించి ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు.ఇప్పుడు ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది.
దానికి తోడు తాజాగా దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత ఎదురు చూస్తున్నారు.







