ట్రంప్ కి బిగ్ షాక్..కేసులు వేసిన 3500 కంపెనీలు..!!

కొంతమందికి దరిద్రం అదృష్టం వెంటపడినట్టుగా పట్టుకుంటుంది.ఆ సమయంలో తప్పించుకోవాలని అనుకున్నా అది సాద్యం కాదు.

ప్రస్తుతం ఇలాంటి గడ్డు పరిస్థితులలోనే ట్రంప్ నలిగిపోతున్నారు.అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ కి ఊహించని విధంగా దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో ట్రంప్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చివరికి ట్రంప్ మెడకే చుట్టుకుంటోంది. కరోనా అమెరికాలో విస్తరించడానికి, ప్రస్తుతం తన పదవికి గండం ఏర్పడటానికి ప్రధాన కారణం చైనా నే అని భావించిన ట్రంప్ చైనాపై పగ తీర్చుకునే పనిలో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే చైనాలో తయారయ్యి తమ దేశంలో దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాలను విపరీతంగా పెంచేసింది ట్రంప్ ప్రభుత్వం.దాంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని పలు కంపెనీలు గుర్రుగా ఉన్నాయి.

Advertisement

సుమారు 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం కూడా మంచిది కాదని వాదిస్తున్నాయి సదరు కంపెనీలు.ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్న కంపెనీలు అనుకున్నదే తడవుగా కోర్టులో కేసులు వేశాయి.

సుమారు 3500 కంపెనీలు కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేశాయి.ప్రభుత్వ నిర్ణయాలు తమకి ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని కలుగిస్తున్నాయని, ప్రభుత్వ తీర్పుని నిలిపివేసేలా, తాము నష్టపోకుండా ఉండేలా తీర్పు చెప్పమని వేడుకుంటున్నాయి.

ఇదిలాఉంటే ఎన్నికలు ముంగిట్లో ఉన్న సమయంలో ట్రంప్ ఇలాంటి చర్యలకు పాల్పడితే అది ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు