Canada Road Accident : కెనడాలో తీవ్ర విషాదం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మరణం , మృతుల్లో అన్నదమ్ములు

కెనడాలో( Canada ) తీవ్ర విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ యువకులు దుర్మరణం పాలయ్యారు.గురువారం తెల్లవారుజామున గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)లోని బ్రాంప్టన్ పట్టణంలో( Brampton ) గురువారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.మృతులను రీతిక్ ఛబ్రా (23) ,( Reetik Chhabra ) అతని సోదరుడు రోహన్ (22),( Rohan ) వారి స్నేహితుడు గౌరవ్ ఫాస్గే (24)గా( Gaurav Fasge ) గుర్తించారు.పీల్ రీజినల్ పోలీస్ (పీఆర్‌పీ) ప్రకారం .సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 3 Indians Die In Accident In Canada-TeluguStop.com

పరిమితికి మించిన వేగం కారణంగా వాహనాలు ఢీకొట్టుకుని వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.మరణించిన ముగ్గురు భారతీయ యువకులు సెనెకా కళాశాలలో( Seneca College ) ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ముగ్గురూ బ్రాంప్టన్‌లోని బేస్‌మెంట్‌ అపార్ట్‌మెంట్‌లో వుంటున్నారు.

Telugu Indians Die, Brampton, Canada, Canada Road, Chandigarh, Gaurav Fasge, Gre

బ్రాంప్టన్‌లోని సావర్గ్ బ్యూటీ సెలూన్‌లో సోదరులు పనిచేసేవారు.దీని యజమాని తిరత్ గిల్( Tirath Gill ) జాతీయ వార్తా సంస్థ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

వారు తమ కుటుంబంలో వ్యక్తుల్లా వుండేవారని, ప్రతివారం దాదాపు 40 గంటలు కలిసి పనిచేశామని గిల్ గుర్తుచేసుకున్నారు.రీతిక్ చబ్రా తన సోదరుడు రోహన్, గౌరవ్‌లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడం , ఆ రాత్రి బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని గిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Indians Die, Brampton, Canada, Canada Road, Chandigarh, Gaurav Fasge, Gre

చబ్రా సోదరులు పంజాబ్‌లోని చండీగఢ్‌కు( Chandigarh ) చెందినవారు కాగా.గౌరవ్ పూణేకు చెందినవాడు.వీరు నివసించే ప్రాంతానికి సమీపంలోనే ప్రమాదం జరిగినందున.వారు డిన్నర్ తర్వాత ఇంటికి తిరిగి వస్తూ వుండొచ్చని తిరత్ గిల్ అభిప్రాయపడ్డారు.వీరు ప్రయాణిస్తున్న వోక్స్‌వ్యాగన్ జెట్టా( Volkswagen Jetta ) ఒక స్తంభాన్ని ఢీకొట్టడం.వారి మరణానికి దారితీసి వుండొచ్చని ఆయన తెలిపారు.

వీరి మరణవార్తతో భారత్‌లోని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారనుకున్న తమ పిల్లలు.తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.గౌరవ్ భౌతికకాయాన్ని భారత్‌కు పంపేందుకు , చబ్రా సోదరుల అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి స్నేహితులు ఆన్‌లైన్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube