ఈ చేప ఒక్కటి దొరికినా లక్షాధికారి కావడం గ్యారంటీ!

సాధారణంగా మనం తినే చేప ప్రాంతాన్ని బట్టి కిలో 100 నుంచి 200 రూపాయలు ఖరీదు చేస్తుంది.

అయితే ఒక చేప మాత్రం ఏకంగా లక్షా డెబ్బై వేల రూపాయలకు అమ్ముడైంది.

ఇంత ధర పలికిన ఈ చేప పేరు కచిడి చేప.సాధారణ చేపలతో పోలిస్తే ఈ చేప చాలా భిన్నం.చాలా అరుదుగా మాత్రమే జాలర్లకు ఈ చేప దొరుకుతుంది.

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఔషధాల తయారీ కోసం ఎక్కువగా వినియోగిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో పులస చేపకు డిమాండ్ ఎక్కువ.

పులస చేప 500 రూపాయల నుంచి వేల రూపాయలు మాత్రమే పలుకుతుంది.అయితే కచిడి చేప మాత్రం దొరికితే ఒక్కరోజులో లక్షాధికారులు కావడం గ్యారంటీ.

Advertisement

తాజాగా ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో ఒక మత్స్యకారుడికి 28 కిలోల బరువు ఉన్న కచిడి చేప దొరికింది.గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చేపలు పుష్కలంగా లభిస్తూ ఉండటంతో ఇలాంటి అరుదైన చేపలు మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి.

మత్యకారుడికి కచిడి చేప దొరికిందనే వార్త ప్రచారం కావడంతో చాలామంది వ్యాపారులు ఈ చేపను కొనడం కొరకు పోటీ పడ్డారు.చివరకు దారకొండ అనే వ్యాపారి చేపను లక్షా డెబ్బై వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.

కచిడి చేపల్లో మగ చేపలకు డిమాండ్ ఎక్కువ.ఆడ చేపలకు కూడా డిమాండ్ బాగానే ఉన్నా మగ చేపలతో పోలిస్తే వాటికి డిమాండ్ తక్కువగానే ఉంటుంది.

ఆపరేషన్లు చేసే సమయంలో వాడే దారం కొరకు ఈ చేపను వినియోగిస్తారని సమాచారం.గోల్డెన్ ఫిష్ అని పిలిచే ఈ చేపను ఖరీదైన వైన్ తయారీలో వినియోగిస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ చేపలు 200 కేజీల వరకు బరువు పెరుగుతాయి.బరువును బట్టి వ్యాపారులు చేపకు రేటును ఫిక్స్ చేస్తారు.

Advertisement

కొన్ని నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ఒక మత్స్యకారునికి చేప దొరకగా ఆ వ్యక్తి 30 కిలోల చేపను 2 లక్షల రూపాయలకు అమ్మేశాడు.

తాజా వార్తలు