ఆ రెండు తలల పాము ధర రూ.25 కోట్లు.. న్యాయమూర్తి కీలక ఆదేశాలు

అడవిలో, పరిసరాల్లో దొరికే కొన్ని అరుదైన జీవులు మనకు దొరికితే ఆశ్చర్యకరంగా చూస్తుంటాం.అయితే అలాంటివి స్మగ్లర్ల కంట పడితే మాత్రం వారికి పంట పండుతుంది.

 25 Crores Valued Two Headed Snake Resuced In Bihar Details, Viral News, Two Head-TeluguStop.com

వాటిని అవసరమైతే విదేశాలకు సైతం తరలించేస్తారు.రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటుంటారు.తాజాగా ‘రెండు తలల’ సర్పాన్ని బుధవారం బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో బయటపడింది.

అయితే అది స్మగ్లర్ల బారిన పడకుండా ఓ న్యాయమూర్తి కాపాడారు.దానిని తన ముందు ప్రవేశ పెట్టాలని ఆదేశించి, ఆ తర్వాత దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.అయితే దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లు పలుకుతుందని తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

బీహార్‌లో ఇటీవల రెండు తలల పాము కనిపించింది.

బెసగురాయ్ జిల్లా బరౌనీ బ్లాక్‌లో గ్రామస్థులు పామును పట్టుకున్నారు.పారా లీగల్ వాలంటీర్ నుండి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి బెగుసరాయ్, సతీష్ చంద్ర ఝా ఈ విషయాన్ని తెలుసుకున్నారు.

పాము తన తోకను హుడ్ లాగా పెంచగలదని, అందుకే రెండు తలలుగా వర్ణించబడుతుందని ఆయనకు తెలుసు.అయితే రెండు తలల పామును స్మగర్లకు చిక్కితే వారు దానిని రూ.25 కోట్లకు అమ్ముకుంటారని గ్రహించారు.

Telugu Bihar, Latest, Snake, Headed Snake, Headedsnake-Latest News - Telugu

దీంతో అరుదైన జాతి పామును సంరక్షణ కోసం ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.ఆ పామును కోర్టులో ప్రవేశపెట్టాలని వాలంటీర్ ముఖేష్ పాశ్వాన్‌కు న్యాయమూర్తి సూచించారు.

ఆ పాము కీటకాలు, ఎలుకలను మాత్రమే వేటాడుతుందని, కాటేసే స్వభావం లేనిదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన అటవీ శాఖ అధికారులు సర్పాన్ని సురక్షితంగా ఉంచాలని సూచించడంతో అక్కడి నుంచి తీసుకెళ్లారు.చైనా వంటి దేశాల్లో దీనికి అధిక డిమాండ్ ఉంది.

ఇలాంటికి ఎక్కడ కనిపించినా కోట్ల రూపాయలు వెచ్చించి స్మగ్లర్లు కొంటుంటారు.అయితే దానిని రక్షించేందుకు న్యాయమూర్తి చొరవ తీసుకుని, అటవీ అధికారులకు అప్పగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube