టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్.ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా లైగర్.
సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాల నెలకొనడంతో పాటు ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని అందరూ భావించారు.కానీ ఈ సినిమా ఊహించని విధంగా తీవ్రమైన డిజాస్టర్ చూసింది.
ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించగా విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది.ఈ సినిమా తీవ్రమైన డిజాస్టర్ ను చవిచూడడంతో పాటుగా 60 కోట్ల భారీ నష్టాన్ని కూడా మిగిల్చింది.
ఈ సినిమా విడుదల అయిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ పై, హీరో విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలను గుర్తించారు అభిమానులు నెటిజన్స్.ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని టాక్.లైగర్ ఫ్లాప్ అవ్వడంతో విజయ్ విజయ్ ప్రస్తుతం తన ఆశలు అన్ని ఈ సినిమా పై పెట్టుకున్నారు.లవ్ స్టోరీస్‌కి విజయ్ కరెక్ట్‌గా సెట్ అవుతాడని పలు చిత్రాలు నిరూపించాయి.మరి సాలిడ్ హిట్‌తో విజయ్ కెరీర్‌లో ఈ సినిమా ఖుషీ నింపుతుందో లేదో చూడాలి.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత అయినా విజయ్ దేవరకొండకు మంచి సక్సెస్ను అందించి విజయ్ ను కాపాడుతుందో లేదో చూడాలి మరి.మరి ఒకవేళ ఆ సినిమా కూడా ప్లాప్ అయితే విజయ్ దేవరకొండ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.







