జీతం రాళ్లతోనే బతుకుతున్న ఉన్నతాధికారులు....!

మన దేశంలో కేవలం జీతం రాళ్లతోనే బతికే ఉన్నతాధికారులు (ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితరులు) ఎంతమంది ఉంటారు? స్థిరాస్తులు సంపాదించుకోకుండా జీవితాలు గడిపే పెద్ద అధికారులు ఎంతమంది ఉంటారు? ఉండరని చెబితే అంతకంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు.

తమకు ఎలాంటి స్థిరాస్తులు లేవని ఏ అధికారి అయినా చెబితే అంతకంటే పాపాత్ముడు మరొకరు ఉండరని అర్థం.

ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా పూర్తిగా జీతం పైసలతోనే బతికేవారు కాగడా వేసి వెతికినా కనిపించరనేది పరమ సత్యం.కాని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పందొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులు, తెలంగాణకు చెందిన ఇరవైరెండు మంది ఐఏఎస్‌ అధికారులు మాకు ఎలాంటి స్థిరాస్తులు లేవు అని డిక్లరేషన్లు ఇచ్చారు.

ఆస్తులు లేవని డిక్లరేషన్లు ఇచ్చినంత మాత్రాన నమ్మడానికి జనం పిచ్చోళ్లా? సివిల్‌ సర్వీసు అధికారులే కాకుండా ఇతర అధికారుల్లో ఆంధ్ర నుంచి నలభైఏడు మంది, తెలంగాణ నుంచి ఇరవై ఎనిమిది మంది అసలు డిక్లరేషన్లు ఇవ్వలేదు.ఐఏఎస్‌ అధికారులు తమ డిక్లరేషన్లను సిబ్బంది-శిక్షణ శాఖకు సమర్పించారు.

ఆంధ్రాలో నూటయాభైరెండు మంది ఐఏఎస్‌ అధికారులు ఉండగా వారిలో ఎనిమిది శాతం మంది, తెలంగాణలో నూట పద్దెనిమిది మంది ఐఏఎస్‌ అధికారులు ఉండగా వారిలో ఇరవైరెండు శాతం మంది తమ పేరుతోగాని, తమ భార్యల పేరుతోగాని ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు.ఆస్తులు లేవని డిక్లరేషన్లు ఇచ్చిన అధికారుల పేర్లన్నీ బయటకు వచ్చాయి.

Advertisement

దీనిపై మీడియా పరిశోధన చేయాలేగాని వివరాలు తెలియకపోవు.తమకు ఎలాంటి ఆస్తులు లేవని వీరు చెప్పారంటే ఉన్న ఆస్తులు అక్రమంగా సంపాదించినవి అయ్యుంటాయి.

అంటే వీరి ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువగా ఉండుంటాయి.తమ ఆస్తులు వివరాలు నిజాయితీగా చెబితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం విచారణకు ఆదేశించవచ్చు.

అధికారులకు ఆస్తులు ఉంటాయనే సంగతి సర్కారుకు కూడా తెలుసు.కాని డిక్లరేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉంది కాబట్టి తూతూ మంత్రంగా పని ముగిస్తారు.

ప్రస్తుతం డిక్లరేషన్లు ఇచ్చిన అధికారుల్లో భార్యాభర్తలు కూడా ఉన్నారు.ఇద్దరూ ఐఏఎస్ అధికారులే అయినప్పుడు ఆస్తులు కూడబెట్టకుండా ఎలా ఉంటారు? సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నది బీదరికంలో బతకడానికా? మన దేశంలో పాలకులు, అధికారులు కాకమ్మ కబుర్లు చెప్పడం సాధారణమే.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు