కెనడాలో భారతీయ విద్యార్ధిపై జాత్యహంకార దాడి.. ఇండియన్ కమ్యూనిటీ ఆగ్రహం

కెనడాలో ( Canada ) భారత్‌కు చెందిన ఓ సిక్కు యువకుడిపై విద్వేషదాడి జరిగింది.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 21-year-old Indian Student Assaulted In Canada Details, Indian Student , Canada-TeluguStop.com

గుర్తు తెలియని దుండగులు విద్యార్ధి తలపాగాను చింపి, అతనిని ఫుట్‌పాత్‌పై లాక్కెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.బాధితుడిని గగన్‌దీప్‌ సింగ్‌గా ( Gagandeep singh ) గుర్తించారు.

శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లున్న ఇతనిపై దుండగుల గుంపు దాడి చేసినట్లుగా తెలుస్తోంది.స్థానిక కౌన్సిలర్ మోహినీ సింగ్ మాట్లాడుతూ.

దాడి జరిగిన విషయం తెలుసుకున్న తాము అతనిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు.గగన్‌దీప్‌ను ఆ పరిస్ధితుల్లో చూడగానే తనకు భయం వేసిందని.

అతను కనీసం నోరు కూడా తెరవలేకపోయాడని మోహినీ సింగ్( Mohini singh ) అన్నారు.యువకుడి కళ్లు వాచిపోయి వున్నాయని.

గాయాలతో తీవ్రంగా బాధపడుతున్నాడని ఆమె చెప్పారు.

Telugu Canada, Canada Nri, Canada Sikh, Gagandeep Singh, Indian, Kelownaroyal, M

శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కిరాణా వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న గగన్‌దీప్ సింగ్ బస్సులో.12 నుంచి 15 మంది యువకులను ఎదుర్కొన్నట్లు తనతో చెప్పాడని మోహినీ తెలిపారు.వారు అతనిని ఇబ్బంది పెట్టడంతో .అతను పోలీసులను పిలుస్తానని హెచ్చరించగా వేధింపులను ఇంకా ఎక్కువ చేశారని ఆమె చెప్పారు.ఈ క్రమంలోనే గగన్‌దీప్ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు.అయితే దుండగుల గుంపు కూడా బస్సు దిగి అతనిని చుట్టుముట్టారు.అనంతరం అంతా కలిసి మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.ఈ ఘటనలో గగన్‌దీప్ ముఖం, పక్కటెముకలు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.

అక్కడితో ఆగకుండా అతని తలపాగాను లాగి, రోడ్డు మీదకు తోశారు.

Telugu Canada, Canada Nri, Canada Sikh, Gagandeep Singh, Indian, Kelownaroyal, M

ఈ ఘటనలో స్పృహతప్పి పడిపోయిన గగన్‌దీప్ సింగ్ అనంతరం తన మిత్రుడికి ఫోన్ చేశాడు.తర్వాత ఇద్దరూ కలిసి 911కి సమాచారం అందించారు.గగన్‌దీప్‌పై ఈ దాడితో అతని స్నేహితులు, అంతర్జాతీయ విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని .ఆదివారం అంతా కలిసి దీనిపై మాట్లాడుకున్నారని మోహినీ సింగ్ చెప్పారు.ఇది ఖచ్చితంగా జాత్యహంకార దాడేనని, దీనిని అలాగే పరిగణించాలని ఆమె కోరారు.

ఈ ఘటనపై కెలోవ్నా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అటు స్థానిక భారతీయ సమాజం కూడా గగన్‌దీప్‌పై దాడిని ఖండించింది.

నిందితులను శిక్షించాలని కమ్యూనిటీ ప్రతినిధులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube