సంక్రాంతి రేస్ లోనే బాలయ్య 107.. ఈసారి రసవత్తరమైన పోటీ!

సంక్రాంతి అంటేనే మన తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ అనే చెప్పాలి.మొదటి నుండి మన టాలీవుడ్ లో పొంగల్ రేస్ లో బడా హీరోలు దిగుతారు.

 2023 Pongal Race Movies In Tollywood Nbk107 Adipurush Varasudu Details, Adipurus-TeluguStop.com

ఇక గత రెండేళ్లు కరోనా కారణంగా సంక్రాంతి రేస్ అంత రసవత్తరంగా సాగలేదు.ఈ ఏడాది కూడా అంతంత మాత్రంగానే ముగిసింది.

అందుకే 2023 సంక్రాంతి రేస్ లో అయినా పెద్ద హీరోలు పోటీలో దిగాలని ఆతృతగా ఉన్నారు.అందుకే వరుస సినిమాలను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ పండుగ సీజన్ లో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మోత మోగించడం ఖాయం.అందుకే సంక్రాంతి పండుగనే టార్గెట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు స్టార్స్.

ఇప్పటికే మన స్టార్స్ ఇద్దరు సంక్రాంతి బరిలో తమ సినిమాలు ఉన్నాయని ప్రకటించారు.ప్రభాస్ నటించిన భారీ సినిమా ఆదిపురుష్. ఈ సినిమా సంక్రాంతికి బిగ్గెస్ట్ రిలీజ్ చేస్తున్నారు.ప్రభాస్ ఎప్పుడో రిలీజ్ డేట్ ప్రకటించి పండుగ సీజన్ లో తాను వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసాడు.

ఇక మరొక మూవీ వారసుడు.ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈసారి ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడు.

Telugu Adipurush, Balakrishna, Chiranjeevi, Nbk, Pongal Race, Sankaranthi-Movie

భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మాతగా విజయ్ దళపతి హీరోగా తమిళ్ లో ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’ పేరుతొ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రెజెంట్ లాస్ట్ షెడ్యూల్ షూట్ జరుపు కుంటున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా ఇదే సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Telugu Adipurush, Balakrishna, Chiranjeevi, Nbk, Pongal Race, Sankaranthi-Movie

ఈ సినిమా రిలీజ్ పై ఎట్టకేలకు మేకర్స్ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు టాక్.ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఇప్పుడు మాత్రం సంక్రాంతి రేస్ లోనే దింపబోతున్నట్టు టాక్. 2023, జనవరి 12న రిలీజ్ చేయడానికి సిద్ధం అయినట్టు టాక్.

ఇదే నిజం అయితే భారీ క్లాష్ తప్పదు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

చూడాలి ఈ పోటీలో ఎవరు తగ్గుతారో ఎవరు నెగ్గుతారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube