2022 సంవత్సరంలో ఊహించని స్థాయిలో సినిమాలు విడుదలయ్యాయి.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదలయ్యాయి.
ఈ ఏడాది విడుదలైన సినిమాలలో డబ్బింగ్ సినిమాలు సైతం సక్సెస్ సాధించడం గమనార్హం.ఈ ఏడాది ఏకంగా 297 సినిమాలు విడుదలయ్యాయని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి.
గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో సినిమాలు రిలీజ్ కాలేదని సమాచారం.ఒక విధంగా ఇది రికార్డ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఎన్నో సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ కీర్తిప్రతిష్టలను పెంచాయి.ఆర్.
ఆర్.ఆర్, కేజీఎఫ్2, కాంతార, కార్తికేయ2 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించడం గమనార్హం.
ఈ ఏడాది సక్సెస్ సాధించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కళ్లు చెదిరే కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలే కావడం గమనార్హం.రాజమౌళి వల్ల ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగింది.డబ్ చేసి సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.2023 సంవత్సరం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల నిర్మాణం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం శుభ పరిణామమని చెప్పవచ్చు.అయితే మరీ చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల కొన్ని చిన్న సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలయ్యాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ వరల్డ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.