తుర్కియే దేశంలోని కపడోషియా ప్రాంతంలో కోడి పిల్లల కారణంగా చాలా పెద్ద నగరం బయటపడింది.అదెలాగంటే, ఈ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి కోళ్లను పెంచుకుంటున్నాడు.
ఆ కోళ్లు మేత కోసం ఉదయాన్నే బయలుదేరి బయటికి వెళ్ళేవి.కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి అదృశ్యమయ్యేవి.
మళ్లీ సాయంత్రం వచ్చేవి.రోజూ అలానే జరుగుతున్నడంతో వాటిని పెంచుతున్న వ్యక్తి బాగా ఆశ్చర్యపోయేవాడు.
అసలు ఏం జరుగుతుందో అని ఒక రోజు నిఘా పెట్టి వాటిని ఫాలో చేశాడు.అప్పుడే కోళ్లు ఒక చిన్న రంధ్రం ద్వారా భూమి లోపలికి వెళ్లడం గమనించాడు.
అది చూసి ఆశ్చర్యపోయిన అతడు లోపల ఇంకా ఎంత లోతు ఉందో తెలుసుకునేందుకు తవ్వడం మొదలుపెట్టాడు.
అప్పుడు అతనికి భూమి కింద ఉన్న ఓ పెద్ద సిటీకి మార్గం కనిపించింది.
దాంతో ఆశ్చర్యపోవడం అతని వంతయింది.తర్వాత ఈ విషయం గురించి అధికారులకు తెలియజేయగా వారు వచ్చి తవ్వకాలు జరిపారు.
ఇదంతా 1963లో జరిగింది.కోడి పిల్లల వల్ల బయటపడ్డ ఆ నగరం పేరు డెరిన్కుయూ.
ఈ సిటీ చాలా పెద్దగా ఉండడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.దీనిలో ఒకేసారి ఏకంగా 20 వేల మంది నివసించవచ్చు.
భూగర్భంలో ఇంత పెద్ద నగరం కనుగొనడం అదే తొలిసారి.భూగర్భంలో ఇంత పెద్ద నగరాన్ని అద్భుతంగా నిర్మించిన వారెవరో ఇంకా తెలియ రాలేదు.

డెరిన్కుయూ సిటీని ధాన్యం వంటి వాటిని స్టోర్ చేయడానికి మొదటగా ఉపయోగించారు.ఆ తర్వాత రక్షణ కోటగా ఇందులో ప్రజలు నివసించడం ప్రారంభించారు.ఈ సిటీలో 18 అంతస్తులు ఉండగా వీటికి 500 కిలోల బరువున్న గుండ్రని రాళ్లను డోర్స్ గా ఏర్పాటు చేశారు.వీటిని భూగర్భంలో ఉన్న ప్రజలు మాత్రమే కదిలించగలిగేలా ఏర్పాటు చేశారు.
అలాగే వీటికి పీక్ హోల్ కూడా పెట్టారు.భూగర్భంలో ఉన్నా కూడా ఈ సిటీలో గాలి సరిగా ఆడేందుకు, వెలుతురు బాగా వచ్చేందుకు వెంటిలేషన్ సిస్టమ్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు.నీటి కోసం ఒక భావి తవ్వారు.9 కిలోమీటర్ల ఏరియాలో 600 మార్గాలను నిర్మించి ఎప్పుడంటే అప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ సిటీలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు.ప్రస్తుతం ఈ సిటీ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.







