2020 బెస్ట్ డైరెక్టర్ సుజిత్.. బెస్ట్ హీరో?

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా సినీ పరిశ్రమలో సినీ అవార్డుల ను అందిస్తుంటారు.

ప్రతి ఏడాదిలో గుర్తింపు తెచ్చుకున్న సినిమాలకు, నటీనటులకు, డైరెక్టర్లకు ఇలా అవార్డులను అందజేశారు.

అంతేకాకుండా బుల్లితెర పై నటించే వాళ్లకు కూడా అవార్డులను అందజేస్తారు.అయితే ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న నటులను తెలుసుకుందాం.

ముందుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏంటంటే భారతీయ సినీ పరిశ్రమలో నిలిచిన ఓ వ్యక్తి.దుండి రాజ్ గోవింద్ ఫాల్కే ఈయనకు మరోపేరు దాదాసాహెబ్ ఫాల్కే.

ఈయన సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ గా తన బాధ్యతలు చేపట్టాడు.కాబట్టి ఈయన ను సినీపరిశ్రమలో ఫాదర్ ఆఫ్ సినీ ఇండస్ట్రీ అని పిలుస్తారు.

Advertisement

ఈయన పేరు గుర్తింపు కోసం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు.కాగా ఈ అవార్డు జాతీయ అవార్డు భాగంగా ఒక్కరికి మాత్రమే దక్కుతుంది.

కాగా గత ఏడాది 2020 సంవత్సరం లో గెలుచుకున్న నటులు ఎవరో తెలుసుకుందాం.సౌత్ సినీ పరిశ్రమలో నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీకి బెస్ట్ మూవీ గా అవార్డు అందింది.

డియర్ కామ్రేడ్ సినిమా లో మంచి పాత్రతో నటించిన బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన కు ఈ అవార్డు అందింది.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తో బెస్ట్ యాక్టర్ గా నవీన్ పొలిశెట్టి ఈ అవార్డు ను పొందాడు.

ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది.కాగా తన పాటలతో ఈ ఏడాది లో ఆదరించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు గా ఈ అవార్డు దక్కింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కాగా అక్కినేని నాగార్జున కు మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా ఈ అవార్డు అందింది.

Advertisement

తాజా వార్తలు