జిరాఫీపై ఒకేసారి 20 సింహాలు అటాక్.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే...

అడవిలో జంతువుల మధ్య ఒక్కోసారి ఊహించని రీతిలో దాడులు జరుగుతుంటాయి.ఒక సస్పెన్స్ యాక్షన్ మూవీ ని ఈ సన్నివేశాలు తలపిస్తాయి.

వీటిలో ట్విస్టులు కూడా ఉంటాయి.ఇలాంటి వైల్డ్ లైఫ్ వీడియోలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయి చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.

తాజాగా ఆ కోవకు చెందిన మరో వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియోలో 20 సింహాల గుంపు నుంచి జిరాఫీ( Giraffe ) అద్భుతంగా తప్పించుకున్నట్లు కనిపించింది.

వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను డేవిడ్ షేర్ అనే 28 ఏళ్ల వ్యాపారవేత్త తీశారు.డేవిడ్ దక్షిణాఫ్రికాలోని( South Africa ) బోట్స్వానాలోని Xai Xai క్యాంప్‌సైట్‌కు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డుపై సింహాల గుంపు గుర్తించాడు.అతను ఆగి వాటిని చూడాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement

సింహాల గుంపు( Lions ) వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలియని జిరాఫీ సమీపంలో నీరు తాగడం గమనించాడు.సింహాలు కూడా జిరాఫీని చూసి ఆకలి తీర్చుకునేందుకు దాని వైపుగా పరుగులు తీసాయి.

అవి జిరాఫీని వేటాడటం ప్రారంభించాయి.

సింహాలు దాడిని ప్రారంభించినప్పుడు, జిరాఫీ ప్రాణాలు రక్షించుకునేందుకు పరిగెత్తే థ్రిల్లింగ్ సీన్ వీడియోలో రికార్డ్ అయ్యింది.జిరాఫీ భారీ కాయంతో చాలా వేగంగా పరుగులంకించుకొని సింహాల నుంచి సులభంగా తప్పించుకోగలిగింది.జిరాఫీ, సింహాలు రోడ్డు మీదుగా, పొదలు గుండా పరిగెడుతూ చాలా నిమిషాల పాటు వేట కొనసాగించాయి.

కానీ జిరాఫీ సింహాలను అధిగమించి సురక్షితంగా తప్పించుకోవడంతో వీడియో ముగుస్తుంది.ఈ వీడియో 2023, నవంబర్ 7న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

జిరాఫీ మనుగడ నైపుణ్యాలు, సింహాల పట్టుదలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు