20 లక్షల కరోనా మృతులు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

దీంతో ప్రపంచదేశాలు కలిసి కట్టుగా ఉంటూ కరోనా మహమ్మారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే కరోనా మృతులు 20 లక్షలకు చేరే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

ఈ మేరకు ప్రపంచదేశాలను హెచ్చరించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మరణాలకు చేరువలో ఉన్నామని, ఇలాగే కొనసాగితే మరో పది లక్షల మందిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

అందుకే అన్ని దేశాలు కలిసి ఈ మహమ్మారిని జయించాలని సూచించారు.పది లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారనేదే ఊహించలేని విషయమని, ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మరో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోతామని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ పేర్కొన్నారు.

చైనా ద్వారా ప్రపంచ దేశాలను వ్యాప్తి చెందిన కరోనా వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారిన పడి 9.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రపంచదేశాలు ఈ వైరస్ బారిన పడి కోలుకోలేని స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు.ఇప్పటివరకూ 3.24 కోట్ల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.ఈ వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే మానవాళి లేకుండా పోతుందని, ప్రపంచదేశాలు కలికట్టుగా ఉండి.

Advertisement

వైరస్ ను నిర్మూలించే ప్రయత్నం చేయాలన్నారు.ఇప్పటికే కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ ను కనుగొన్నాయని, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తర్వాత టీకాను వృద్ధి చేసి వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాలకు అందించాలంది.

ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు సంపన్న దేశాలు ఆదుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

Advertisement

తాజా వార్తలు