టీడీపీ కి జంప్ అయితే ఇరవై కోట్లు

ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’పై విపక్ష వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు గుప్పించారు.నేటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ మహిళా నేత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.పార్టీ మారితే రూ.20 కోట్లిస్తామని టీడీపీ నేతలు తనను ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు

 20 Crs For Jumping Leaders To Tdp-TeluguStop.com

అయితే తాను డబ్బుకు లొంగే మనిషిని కాదని స్పష్టం చేశానని కూడా ఆమె పేర్కొన్నారు.ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా తేల్చిచెప్పారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, కడవరకు తాను వైసీపీలోనే కొనసాగుతానని తెలిపారు.

తాను పార్టీ మారతానంటూ కొన్ని పత్రికలు, వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube