ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకున్నాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ….ఈ పేరు వింటే చాలు మాస్ ప్రేక్షకులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు.

 Janatha Garage Will Have Realistic Action Scenes-TeluguStop.com

మాస్ ఫాలోయింగ్ లో ఎన్టీఆర్ కి ఎన్టీఆరే సాటి.పవన్,మహేష్ కూడా సీడేడ్ ఏరియాలో ఎన్టీఆర్ వెనకాలే ఉండటం అనేది ఎన్టీఆర్ మాస్ క్రేజ్ కి ఉదాహరణ.

ఆ మాస్ ప్రేక్షకుల అండతోనే ఫ్లాపులు పడతున్నా ఎన్టీఆర్ రేంజ్ తగ్గలేదు.కాని ఆ మాస్ ప్రేక్షకులే తనకి శాపంగా కూడా మారారు.

మహేష్, పవన్ యూత్ లో స్టయిల్ క్రియేట్ చేసే పాత్రలను ఎంచుకుంటూ భారి కలెక్షన్లు రాబడుతోంటే .ఎన్టీఆర్ మాత్రం ఎంతసేపు మాస్ జనాల్ని తృప్తిపరచడం కోసమే, ఊరమాసు సినిమాలు,నరకడం,చంపడం,పగ, ప్రతీకారాలు అంటూ సినిమాలు తీసాడు .ఈ టైపు సినిమాలకి ఎప్పుడో కాలం చెల్లింది.మరీ ముఖ్యంగా, నైజాం, ఓవర్సీస్ ప్రేక్షకులు అలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడరు.

ఇప్పుడు ఫైట్స్ లో ఏమాత్రం ఓవరాక్షన్ కనిపించినా ప్రేక్షకులకి విసుగొచ్చేస్తోంది.

టెంపర్,నాన్నకు ప్రేమతో చిత్రాలతో తన ఇమేజ్ మార్చుకోవడానికి చక్కని ప్రయత్నాలు చేసాడు యంగ్ టైగర్.

ప్రస్తుతం చేస్తున్న జనతా గ్యారేజ్, కేవలం మాస్ ప్రేక్షకులకే కాకుండా అన్నివర్గాల ప్రేక్షకులకి తనని చేరువ చేస్తుందని ఎన్టీఆర్ నమ్మకం.అందుకే ఫైట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఇన్నిరోజులలాగా కొడితే గాల్లో ఎగిరిపోవడం, ఎదో బాల్ బౌన్స్ అయినట్టు, విలన్లు బౌన్స్ అయిపోవడం, ఇష్టమొచ్చినట్లు చెప్పే పంచ్ డైలాగులు .ఇవేవి ఉండవంట జనతా గ్యారేజ్ లో.పోరాట సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటూనే, సహజత్వానికి దగ్గరగా ఉంటాయంట.ఎన్టీఆర్ ఇకనుంచి తలతోకలేని సన్నివేశాలు,ఫైట్స్ చేసే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నాడట.

ఎంత మంచి మార్పో !

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube