వామ్మో.. ఏంటి భయ్యా.. ఆ ఇంట్లో పాములు కలిసి ఏమైనా పుట్ట పెట్టాయా ఏంటి..?

సహజంగా మనలో చాలామందికి పాములు( Snakes ) అంటే చాలా భయంగా ఉంటుంది.పాములంటే చాలా భయం ఉండడంతో పాటు.

మరోవైపు కొందరు వారి కుల దైవంగా కూడా కొలుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఎక్కడైనా కానీ.

, బహిరంగ ప్రదేశాలలో పాము దర్శనమిస్తే ఒక్కసారిగా అక్కడి వారందరూ భయభ్రాంతులకు గురై కంగారు పడుతూ ఉంటారు.ఇంకా మరికొందరు అయితే.

, వారు నిద్రపోయే సమయంలో కలలోకి పాము రాగానే ఒకసారిగా ఉలిక్కిపడి నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే తాజాగా ఒక ఇంట్లో గుంపులు గుంపులుగా పాములు బయటపడడం చూసి ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకి వెళ్తే.బీహార్ లోని( Bihar ) కైరా గ్రామానికి చెందిన సందీప్ మహాతో ఇంట్లో గత రెండు రోజులుగా పాములు బయటపడడం ఇంట్లో వారిని భయాందోళనకు గురిచేస్తుంది.వాస్తవానికి వర్షపు నీరు( Rain Water ) ఇంకిపోవడంతో ఈ పాములు బయటికి వచ్చాయని ఆ పాములను పట్టుకొని పొలంలోకి వదిలేసినట్లు బాధితుడు తెలియజేస్తున్నాడు.

అనంతరం ఇంట్లో ఉన్న రంద్రాల నుంచి పాములు కుప్పలు తెప్పలుగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలియజేయగా.గ్రామస్తులు అందరూ కలిసి ఇంట్లో అంతా మొదలు పెట్టడంతో 32 పాము గుడ్లు కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇది ఇలా ఉండగా.మరోవైపు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక గ్రామస్తుల కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు( Forest Officers ) ఫిర్యాదు చేశారు.దీంతో అటవీశాఖ అధికారులు ఇంటి వద్దకు చేరుకొని పాములను పట్టుకున్నట్లు సమాచారం.

అయితే వాస్తవానికి ఆ పాములు ఎలుకలు చేసిన రంధ్రాల ద్వారా వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో వైరల్ : నవ్వి..నవ్వి.. పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ.. ప్రాంక్ మాములుగా లేదుగా
Advertisement

తాజా వార్తలు