వైరల్: పెను రైలు ప్రమాదం నుంచి తప్పించిన 12 ఏళ్ల బాలుడు..

ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాలలో అనుకొని సంఘటన నేపథ్యంలో రైలు యాక్సిడెంట్లు( Train Accidents ) జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ యాక్సిడెంట్లకు కారణం చాలామంది ఆకతాయిలు చేసిన పనులు కూడా కారణం అవుతున్నాయి.

 12 Years Old Bihar Boy Averts Major Train Accident Details, Train Accident, Trai-TeluguStop.com

మరి కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యుల వల్ల కూడా అనేక దుర్ఘటనలు జరిగాయి.రైలు పట్టాలపై ఏదో రకమైన లోహ పదార్థాలను ఉంచి రైలును ట్రాక్ తప్పించేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా బీహార్లో( Bihar ) ఓ బాలుడు రైలు ప్రమాదం నుంచి తప్పించాడు.ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలోని భోలా టాకీస్ గుప్తీ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల మొహమ్మద్ షాబాజ్( Mohammad Shahbaz ) తన స్నేహితులతో కలిసి రైలు ట్రాక్స్ వద్ద సరదాగా ఆడుకుంటున్నారు.అలా ఆడుకుంటున్న సమయంలో షాబాజ్ రైలు పట్టా విరిగిపోవడం గమనించాడు.దీంతో వారందరూ భయపడిపోయి అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేయగా షాబాజ్ మాత్రం కాస్త ఆలోచించి ఆ ట్రాక్పై ఏదైనా రైలు వస్తే ప్రమాదం సంభవిస్తుంది అన్న నేపథ్యంలో అతను అతని దగ్గర ఉన్న ఎర్ర టవల్( Red Towel ) తీసుకొని ప్రాణాలకు తెగించి హౌరా-కథ్ గోడమ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కి ఎదురుగా వెళ్లాడు.

ఇది గమనించిన ఆ ట్రైన్ లోకో పైలట్( Loco Pilot ) వెంటనే రైలును ఆపి అక్కడ పరిస్థితిని గమనించాడు.దాంతో వెంటనే అధికారులకు విషయాన్ని తెలుపగా రైలు ట్రాక్ సరిచేసి రైలును పంపించారు.అయితే ఎలాంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడిన షాభాజ్ ను రైల్వే అధికారులు, ప్రజలు అభినందించారు.

ఈ నేపథంలో ఆ బాలుడికి ప్రధానమంత్రి బాల పురస్కారం ఇవ్వాల్సిందిగా కోరారు.ఇది ఏమైనా ఆ బాలుడు చేసిన సమయస్ఫూర్తి కారణంగా చాలా పెద్ద నష్టం నుంచి బయటపడ్డాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube