అరుదైన రికార్డ్ ను సృష్టించిన భారత సంతతి బాలిక..

ప్రస్తుత రోజుల్లో పిల్లలు చదువుతో పాటు ఎన్నో రకాల కొత్త నైపుణ్యాల మీద కూడా దృష్టి సారిస్తున్నారు.

చిన్నతనం నుంచే జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని దాని కోసం శ్రమించే వారు చాల తక్కువ మంది ఉంటారు.

అందులోనూ సాహసోపేతమైన దారిలో వెళ్ళటానికి ఎంతో ఆత్మస్థైర్యం కావాలి.దానికి తగట్టుగా తల్లితండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం.

అమ్మయి అయితేనేం, మగపిల్లలకి ఏ మాత్రం తీసిపోకూడదు అన్నట్టుగానే కొంతమంది తల్లితండ్రులు బాలికలకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.బాలికలు కూడా అదే విధంగా విజయాలతో దూసుకుపోతున్నారు.

ఈ కోవకు చెందినదే ఓ ముంబై బాలిక.కామ్య కార్తీకేయన్, ఈ ముంబై బాలిక వయసు 12 సంవత్సరాలు.ఇంత చిన్న వయసులో దక్షిణ అమెరికాలోని అతి పెద్ద పర్వతమైన “అక్కాన్కాగో” ను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.6,962 మీటర్ల ఎత్తైన ఈ పర్వతం అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణిలో ఒకటి.కామ్య ఫిబ్రవరి 1న ఈ పర్వతాన్ని అధిరోహించింది.

Advertisement

అయితే.

కామ్య నేవీ చిల్ద్రెన్ స్కూల్ లో 7వ తరగతి విద్యార్ధిని.ఆమె తండ్రి చెప్పే పర్వతారోహన కథలు వింటూ తను ఈ రకమైన ఇష్టాన్ని పెంచుకుంది.మూడేళ్ళ వయసులో లోనోవాలా (పూణే) లో ప్రాథమిక ట్రెక్కింగ్ తో ప్రారంభమైన కామ్య, 9 ఏళ్ళ వయసులోనే ఆమె తల్లితంద్రులతో ఉత్తరాకాండ్ లోనే రూప్ కుండ్(5020 మీటర్లు)పర్వతంతో పాటు హిమాలయాలలోని అనేక శిఖరాలను అధిరోహింహింది.

ఇక 2019 ఆగస్ట్ 24న లాద్దఖ్ లోని 6,260 మీటర్లు ఎత్తైన మెంటోక్ కాంగ్రి2 ను అధిరోహించింది.అలాగే 6,153 మీటర్లు ఎత్తు గల స్టోక్ కాంగ్రి అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు కూడా కామ్యనే.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు