కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి పలుప్రాంతాల్లో ముంచెత్తిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.ఇడుక్కు జిల్లాలోని తోడుపుళలో వరద కారణంగా ఓ వ్యక్తి మరణించాడు.
రూరల్ కొట్టాంయంలో కొండ చరయలు విరిగిపడి 12మంది గగల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లేకపోవడంతో గాలింపు చర్యలు ముందుకు సాగడం లేదు.
దీంతో సహాయక చర్యల కోసం వాయుసేన సాయాన్ని కేరళ ప్రభుత్వం అర్థించింది.కొండ చీరలు కారణంగా ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి కొట్టాయం జిల్లాలోని సహాయ చర్యల కోసం వైమానిక సహాయాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
కొట్టి యములో జిల్లాలో కొండచరియలు విరిగి పడటంతో మూడు ఇల్లు ధ్వంసం కాగా 10 మంది గల్లంతయ్యారు.జిల్లాలో నాలుగు చోట్ల కూడా కొండచరియలు విరిగిపడిన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇళ్లలోకి నీరు చేరడంతో 60 మంది చిక్కుకుపోయారు.వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.వరదల కారణంగా కొట్టాయం, పతనమిట్టలోని జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి.పతనిమిట్టలోని కుక్కి డ్యామ్, త్రిసూర్లోని షోలాయర్, ఇడుక్కిల్లో ని కుందాల, కల్లరకుట్టి డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అలాగే రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.