ఏంటి 110 ఏళ్ల బామ్మకు కొత్త దంతాలు, వెంట్రుకలు మొలవడమా? అని ఆశ్చర్యపోవద్దు.మీరు విన్నది నిజమే.
నేటి కాలుష్య ప్రపంచంలో యుక్త వయసులోనే చాలా మంది జుట్టుని పూర్తిగా కోల్పోయి ఎన్నో రకాలైన న్యూనతా భావాలకు లోనవుతున్నారు.ఉన్న జుట్టును కాపాడుకోలేక, పోయిన జుట్టుని మొలిపించుకోలేక నరక యాతన చూస్తున్నారు.
ఇంకా పెళ్లి కానివారైతే వారి బాధలు ఆ పగవాడికి కూడా రాకూడదు.ఇలాంటి తరుణంలో ఓ వృద్ధురాలికి, పైగా 110 ఏళ్ల వయసులో కొత్తగా జుట్టు మొలవడం అంటే సాధారణమైన విషయమా? ఈ ఘటన చూసి ఇపుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కాగా తాజాగా ఆ వృద్ధురాలికి పుట్టిన రోజు వేడుకలు సదరు కుంటుంబం ఎంతో హాట్టహాసంగా జరిపారు.వివరాల్లోకి వెళితే, పశ్చిమ్ బెంగాల్, రామచంద్రాపూర్‌లోని బడ్జ్ బడ్జ్‌లో నివసిస్తున్న ఆ వృద్ధురాలి పేరు సఖిబాలా మోండల్.ఆ వృద్ధురాలికి ఆమెకు కొత్తగా జట్టు, దంతాలు రావడంతో పుట్టిన రోజులు నిర్వహించారు.యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ‘దీదీర్ దూత్’ నిర్వాహకులు కూడా ఉండడం యాదృశ్చికం.
ఈ పుట్టినరోజు వేడుకలో వారు కూడా పాల్గొన్నారు.పశ్చిమ బెంగాల్ ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నేరుగా కనెక్ట్ కావడానికి ‘దీదీర్ దూత్’ అనే మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా పుట్టినరోజు వేడుకలో బడ్జ్ బడ్జ్ నంబర్ 2 బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బుచన్ బెనర్జీ ప్రత్యేక అతిథిగా పాల్గొని ఆమెనుండి ఆశీస్సులు పొందారు.బుచ్చన్ బెనర్జీ మాట్లాడుతూ.స్థానికులకు అమ్మమ్మ ఆశీస్సులు, మమతా బెనర్జీ పాలన అండగా ఉంటాయన్నారు.బర్త్‌డే పార్టీకి హాజరవడం చాలా సంతోషంగా ఉందని, సఖిబాలా మోండల్ 110 సంవత్సరాల వయసులో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా సఖిబాలా మోండల్ 80 ఏళ్ల కుమార్తె, మనవడు, మనవరాలు, వారి కుమారులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు.







