వరంగల్ అన్నాసాగర్ లో చిక్కిన కేటుగాడు..!

వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండలం అన్నాసాగర్ లో ఓ దొంగ అడ్డంగా బుక్కయ్యాడు.

నగరంలోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో సెలఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను కేటుగాడు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో చోరీకి వచ్చిన దొంగను విద్యార్థులు గుర్తించి వెంబడించడంతో పారిపోతూ బావిలో పడ్డాడు.అనంతరం విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని బావిలోంచి బయటకు తీశారు.

కాగా గత మూడు రోజులుగా స్టూడెంట్స్ ల్యాప్ ట్యాపులు, సెల్ ఫోన్లు అపహరించడాని తెలుస్తోంది.మరోవైపు హాస్టల్ లో విద్యార్థినీలకు సరైన భద్రత లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు.

Advertisement
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..

తాజా వార్తలు