ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ శాతం మంది టీ లేదా కాఫీని తాగుతుంటారు.అయితే టీ కాఫీల వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మాత్రం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి అద్భుతంగా సహాయపడుతుంది.టీ కాఫీలకు బదులు రోజు ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే హాఫ్ కీరా దోసకాయ తీసుకుని తొక్క చెక్కేసి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, నాలుగు నుంచి ఐదు ఫ్రెష్ పాలకూర ఆకులు, అర అంగుళం పొట్టు తొలగించిన పచ్చి పసుపు కొమ్ము, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి.
చివరిగా ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుంటే సరిపోతుంది.ఈ బీట్ రూట్ కీరా పాలకూర జ్యూస్ ను రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి.ప్రతిరోజు ఈ హెల్తీ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.
రక్తహీనత దూరమవుతుంది.ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.చర్మం యవ్వనంగా, కాంతివంతంగా తయారవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.
మరియు శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా సైతం ఉంటాయి.ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ జ్యూస్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.