రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా హీరో ...ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో

బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి పేరు ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో మార్మోగుతోంది.

బాహుబ‌లి - ది కంక్లూజ‌న్ చూసిన హిందీ స్టార్ హీరోలు ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా చేసేందుకు క్యూలోనే ఉన్నారు.

అమీర్‌ఖాన్ లాంటి హీరోలు రాజ‌మౌళితో సినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నా మ‌న జ‌క్క‌న్న మాత్రం తెలుగు హీరోల‌తోనే త‌న నెక్ట్స్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు.ఇక రాజ‌మౌళి నెక్ట్స్ సినిమాపై గ‌త కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

రాజమౌళి మాత్రం తెలుగులోనే తన నెక్ట్స్‌ సినిమా ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించాడు.ప్రముఖ నిర్మాత డివివి.

దానయ్య నిర్మాణంలో రాజమౌళి తర్వాత సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే.ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసే అదృష్టం ఎవరికి దక్కుతుందో అని గత రెండు మూడు నెలలుగా సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా మ‌హేష్‌బాబు లేదా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఉండ‌బోతోంద‌ట‌.దాన‌య్య వ‌ద్ద జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు డేట్లు ఉన్నాయి.

అలాగే దాన‌య్య బ్యాన‌ర్‌లో రాజ‌మౌళి కూడా ఓ సినిమా చేయాలి.రాజ‌మౌళి అటు దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్.

నారాయ‌ణ‌కు కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.దీంతో రాజ‌మౌళి ముందు దాన‌య్యకు ఇచ్చిన క‌మిట్‌మెంట్ ప్ర‌కారం ఈ సినిమా కంప్లీట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

అందుకే రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా మ‌హేష్ లేదా ఎన్టీఆర్‌తో ఉంటుంద‌ని టాక్‌.

కూతుళ్లను హీరోయిన్స్ ని చేసిన నిన్నటి తరం అందమైన హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు