భర్తకి ఎడమ వైపునే భార్య స్థానం....ఎందుకో తెలుసా?

సాధారణంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం మనకి స్పష్టంగా అర్ధం అవుతుంది.

అమ్మవారితో సహా స్వామివారు వెలసిన దేవాలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

అలాగే దైవ కార్యాల్లోనూ .శుభకార్యాలలోను భార్యా భర్తలు పాల్గొన్నప్పుడు భర్తకి ఎడమవైపున మాత్రమే భార్య వుండాలని పెద్దలు చెబుతుంటారు.భార్యాభర్తలు ఫోటో దిగుతున్నా ఈ విషయాన్ని మాత్రం మరిచిపోరు.

అంతగా ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో పెనవేసుకుపోయింది.మన పెద్దవారు ఏ పనిచేసినా అందులో ఒక అర్థం .పరమార్థం తప్పనిసరిగా ఉంటాయి.ఇదే విషయం మరోమారు ఇక్కడ స్పష్టమవుతుంది.

శరీరంలో కుడిభాగాన్ని సవ్య భాగమనీ .ఎడమ భాగాన్ని అపసవ్య భాగమని అంటూ వుంటారు.కుడిభాగానికి వుండే శక్తి సామర్థ్యాలు ఎడమభాగానికి వుండవు.

Advertisement

అందువలన ఎప్పటికప్పుడు ఎడమభాగానికి అదనపు శక్తి అవసరమవుతుంటుంది.కుడి భాగాన్ని శివుడికి సంకేతంగాను .ఎడమభాగం శక్తికి సంకేతంగాను చెబుతుంటారు.ఈ కుడి ఎడమల కలయికనే అర్థనారీశ్వర రూపమని అంటుంటారు.

శరీరంలో ఎడమభాగం శక్తి భాగం కనుక, భర్తకి ఎడమవైపునే భార్య ఉండాలనే నియమాన్ని పెట్టారు.ఈ విధమైన ఆచారాన్నిపాటించడం వలన ఆలోచన .ఆచరణ అనేవి సమపాళ్లుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని నమ్మకం.

Advertisement

తాజా వార్తలు