వరుస ఫ్లాప్‌ల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’.ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించగా తమన్నా హీరోయిన్‌గా నటించింది.
ఈ చిత్రానికి ముందు కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా కాజల్ హీరోయిన్‌గా నటించింది.
‘ఎమ్మెల్యే’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా ప్రచారం చేశారు.అయితే అంచనాలను ఆ చిత్రం అందుకోవడంలో విఫలం అయ్యింది.
ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో ఎమ్మెల్యే సినిమా ఫ్లాప్ అయ్యింది.దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘నానువ్వే’ చిత్రంపై అందరి దృష్టి ఉంది.

‘నానువ్వే’ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు.కారణం కళ్యాణ్ రామ్ చేసిన ఏ సినిమా కూడా ఈమద్య సక్సెస్‌ను దక్కించుకోలేక పోతుంది.అందుకే ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం లేదు.అయితే ఈ చిత్రంలో తమన్నా ఉండటం వల్ల ఏమైనా కొత్తగా ఉంటుందా అని మాత్రం ఆలోచిస్తున్నారు.
సినిమా మొత్తం పూర్తి అయ్యి, విడుదలకు సిద్దం అయ్యింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రాన్ని ఈవారంలోనే అంటే ఈనెల 25న విడుదల చేయాల్సి ఉంది.
కాని చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు
సరైన కారణం చెప్పకుండా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడం ప్రస్తుతం పలు అనుమానాలకు తెర లేపుతుంది.‘నానువ్వే’ సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులకే నమ్మకం లేదని, అందుకే సినిమాను సేఫ్ జోన్‌లో విడుదల చేసి అంతో ఇంతో కలెక్షన్స్ రాబట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
జయేంద్ర గతంలో తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది.అందుకే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందేమో అని డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకే ముందుకు రాలేదు.
అయినా కూడా నిర్మాతలు సొంతంగా విడుదలకు సిద్దం అయ్యారు
విడుదలకు అంతా రెడీ అయ్యాక ‘నేలటికెట్’ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఆ సినిమాకు పోటీ పోవడం వల్ల నష్టం తప్ప లాభం లేదని నిర్మాతలు భావిస్తున్నారు.దానికి తోడు తమ సినిమాపై తమకే ఎక్కువ నమ్మకం లేదు.
దాంతో చేసేది లేక ‘నా నువ్వే’ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టు తిరుగుతుందనిపిస్తుంది.
ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు ఎక్కవు.ఆ కారణంగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు కొంత టెన్షన్ పడుతున్నారు.
అయితే కళ్యాణ్ రామ్ లుక్ మాత్రం బాగుంది.కళ్యాణ్ రామ్‌కు ఇది సక్సెస్ తెచ్చి పెట్టకున్నా ఆయన కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.