తగ్గేదెలే అంటున్న గ్రామ పంచాయతీ పాలక వర్గం

నల్లగొండ జిల్లా: ఇండస్ట్రియల్ పార్కుకు సానుకూలంగా తీర్మానం చెయ్యాలనే ప్రభుత్వ హుకుమ్ ను వెలిమినేడు గ్రామపంచాయతి పాలకవర్గం త్రిప్పికొట్టింది.ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని భూ-పోరాట కమిటి చేసిన ఆందోళనకు స్పందించి పార్కుకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి తగ్గేదెలే అని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే వెలిమినేడు గ్రామపంచాయతి పరిధిలోని సర్వే నెంబర్లు 418,415,396 లలోని 196.18 ఎకరాల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.దీనికి సానుకూలంగా గ్రామపంచాయతి తీర్మానం చేయాలని జిల్లా పంచాయతీ ఆఫీస్ (డిపిఓ) నుండి హుకుమ్ జారీ చేయబడింది.

దీనికి వ్యతిరేకంగా పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి నాయకత్వంలో భూపోరాట కమిటీ సభ్యులు వెలిమినేడు గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించి సర్పంచ్ దేశబోయిన మల్లమ్మకి మెమోరాండం అందజేశారు.డిపిఓ కార్యాలయ హుకుం ను పక్కన పెట్టిన గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆందోళనకారుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని పార్క్ కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది.

గ్రామపంచాయతి ముందు ఆందోళన చేసిన వారిలో భూపోరాట కమిటీ అధ్యక్షుడు అంశాల సత్యనారాయణ,సభ్యులు అర్రూరి శివకుమార్ ప్రజాపతి,గుఱ్ఱం జంగయ్య ముదిరాజ్,జనగామ సత్యనారాయణ,మేడి రాములు,జనగామ వెంకటేశ్ ముదిరాజ్,ఎల్కరాజు మారయ్య,మేడి కృష్ణ,మేడి మల్లయ్య,మెట్టు రాములు,అర్రూరి లక్ష్మినారాయణ ప్రజాపతి,మంకాల శేఖర్ తదితరులు పాల్గొనగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!
Advertisement

తాజా వార్తలు