ఖమ్మం ప్రజలని పిచ్చోళ్లని చేసిన నామా...???..మరీ ఇంత డ్రామానా..???

నమ్ముకున్న పార్టీకి సున్నం రాసి, స్వార్ధ ప్రయోజనాల కోసం అన్ని విధాలుగా తమ ఎదుగుదలకి ప్రోత్సాహం ఇచ్చిన పార్టీకే వెన్నుపోటు పొడిచి మరీ పక్క పార్టీలోకి జంప్ అవ్వడం కొంతమంది నేతలకి పెద్ద విషయం కాదు.

ఇలాంటి జంపింగ్ లు ప్రతీ పార్టీలో ఉంటూనే ఉంటారు అయితే.

కొంత మంది నేతల మాత్రం వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రస్తుత తాము ఉన్న పార్టీ తరుపు ఎన్నికల్లో పోటీ చేసి కావాలని ఓడిపోయి, చివరికి తాము ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ లోకి సైలెంట్ గా వెళ్ళిపోతారు, ఇది తాజా తెలంగాణా రాజకీయం.అరె ఇలాంటి నేతలు కూడా ఉంటారా అంటే ఉంటారనే చెప్పాలి.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సదరు నేత గురించి పెద్ద చర్చే జరుగుతోంది.తెలంగాణలో గడించిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఎలాగైనా సరే టీఆర్ఎస్ ఖాతాలో ఖమ్మం జిల్లాని వేసుకోవాలని అనుకున్న కేసీఆర్ అందుకు తగ్గట్టుగా భారీ వ్యుహాన్నే రచించారట.టీఆర్ఎస్ తరుపున అసెంబ్లీ స్థానం నుంచీ పువ్వాడ అజయ్‌కుమార్‌‌ పోటీ చేయగా, ప్రజా కూటమి తరుపున తెలుగుదేశం బలపరిచిన అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు పోటీ చేశారు.

Advertisement

అయితే అప్పటికే ఖమ్మం ప్రజలు పువ్వాడ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని పువ్వాడ ఓటమి ఖాయమని టాక్ రావడంతో టీఆర్ఎస్ కూడా ఒకింత ఆందోళనలో పడింది.కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం పువ్వాడ కి అనుకూలంగా వచ్చాయి.

నామా ఓటమి పాలవ్వడంతో టీడీపీ ,కాంగ్రెస్ లు షాక్ అయ్యాయి.వారు వేసుకున్న అంచనాల ప్రకారం నామా గెలుపు పక్కా మరి ఎలా ఓటమి చెందారు.?? అనూహ్యంగా టీఆర్ఎస్ ఎలా గెలుపొందింది.?? సీన్ కట్ చేస్తే.

నామా నాగేశ్వరరావు తాజాగా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.నామ ఎప్పుడైతే టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచీ కాంగ్రెస్, టీడీపీ లకి నామా గత ఎన్నికల్లో ఓటమిపై సందేహాలు రావడం మొదలయ్యాయి.రాజకీయ పండితులు సైతం నామా టీఆర్ఎస్ ఎంట్రీ కి గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఓటమికి లింక్ పెడుతున్నారు.

వారి విశ్లేషణ ప్రకారం.నామా ప్రజా కూటమి తరుపున పోటీ చేసినప్పుడే టీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం జరిగిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా టీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని అందుకు గాను అసెంబ్లీ స్థానం నుంచీ పోటీ చేసే ఓడిపోవాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అందులో భాగంగానే నామా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కష్టపడి పని చేయలేదని, టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడంలో సైతం వెనుకాడారని, అటు తెలుగు దేశం , ఇటు కాంగ్రెస్ నేతల్ని కలుపుకు పోకుండా దూరం పెట్టారనే కామెంట్స్ వస్తున్నాయి.ఇదే సమయంలో ప్రజా క్షేత్రంలో తిరగడంలో కూడా నామా వెనకడుగు వేసేవారని అప్పటి పరిస్థితిలు గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.నామా టీఆర్ఎస్ లో చేరడం కోసమే ఓటమి చెందారని, నామాని నమ్ముకుని ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలని పిచ్చోళ్లని చేశారని టాక్ రావడంతో ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నామా తీరుపై గుర్రుగా ఉన్నారు.

Advertisement

అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో నామాని ఓడించి తీరుతామని శపధం చేస్తున్నారట.మరి ఖమ్మం జిల్లా ప్రజానీకం రానున్న ఎన్నికల్లో నామాని ఓడిస్తుందా, గెలిపిస్తుందా అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

తాజా వార్తలు