నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఘోరం! ఎక్పైర్ మందుల ప్రభావం!

హైదరాబాద్ లో నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఘోరం చోటు చేసుకుంది.

ప్రభుత్వ డాక్టర్స్, అక్కడ పిల్లలని హెల్త్ ఇన్ ఫెక్షన్ రాకుండా ఉండటానికి వాక్షిన్ లు, టాబ్లెట్స్ ఇచ్చారు.

అయితే అవి కాస్తా వికటించడంతో చిన్నారులు అధిక సంఖ్యలో అస్వస్థతకి గురయ్యారు.ఈ సెంటర్ లో మొత్తం 80 మంది పిల్లలకి వాక్సిన్ లు, టాబ్లెట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

వాళ్ళలో అధిక సంఖ్యలో చిన్నారులు అస్వస్థతకి గురి కావడంతో వెంటనే నీలోఫర్ హాస్పిటల్ లో చేర్చారు.ఇదిలా వుంటే నీలోఫర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలలో ఇప్పటికే ఓ చిన్నారి మరణించగా, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది.

ఇక హాస్పిటల్ లో 15 మంది పిల్లలకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే పిల్లలు వాక్సిన్ వలన అస్వస్థతకి గురి కాలేదని, అక్కడ ఇచ్చిన టాబ్లెట్స్ వలన అస్వస్థతకి గురైనట్లు డాక్టర్స్ గుర్తించారు.ఎక్పైర్ అయిన టాబ్లెట్స్ వేసుకోవడం వలన ఇలా జరిగి వుంటుందని తెలుస్తుంది.

దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు