అభినందన్ కి ఈ రోజు వైద్య పరీక్షలు, విచారణ!

పాకిస్తాన్ కి యుద్ధ ఖైదిగా దొరికిన ఇండియన్ జవాన్ అభినందన్ వర్థమాన్ ని ఇండియాలో అడుగుపెట్టాడు.

రెండు రోజుల పాటు శత్రు భూభాగంలో వున్నా కూడా ఎలాంటి ధైర్య సాహసాలు వదలకుండా ఆ దేశాన్ని సైతం ఆశ్చర్యపరిచిన అభినందన్ కి ఇప్పుడు దేశం యావత్తు సెల్యూట్ చేస్తుంది.

నిన్న రాత్రి దౌత్యపరమైన ప్రాసెస్ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అభినందన్ ని భారత్ కి అప్పగించింది.ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అతన్ని నేరుగా అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ రోజు అభినందన్ కి వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు, ఐబీ విచారణ ఎదుర్కోవాల్సి వుంటుంది.వైద్య పరీక్షలలో భాగంగా అతనికి పాకిస్తాన్ ఏమైనా మత్తుమందు ఇచ్చి ఏవైనా చిప్స్ లాంటివి అమర్చే ప్రయత్నం చేసిందా అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అతనిని ఇంటలిజెన్స్, రా అధికారులు విచారించే అవకాశం వుంది.ఈ విచారణలో ఐఎస్ఐ అభినందన్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగింది.

Advertisement

వాటికి తాను ఎలాంటి సమాధానాలు చెప్పాడు అనే విషయాలని ఇంటలిజెన్స్ అధికారులు తెలుసుకుంటారు.ఇక ఈ పరీక్షలు అన్ని అయిన తర్వాత అభినందన్ మళ్ళీ తన విధులలో చేరే అవకాశం వుందని తెలుస్తుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు