అక్కడ ఆడవాళ్ళే మగవారిని రేప్ చేస్తున్నారట

ప్రతిరోజు మన దేశంలోనే వందల రేప్ కేసులు చూస్తున్నాం.దేశంలోని ప్రతి జిల్లాలో రోజుకి ఒక్క రేప్ అయినా జరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి.

మరి ఈ రేప్ అంటే ఏమిటి ? ఒకరి మానాన్ని భంగం చేయడం.అంటే ఒకరి అనుమతి లేకుండా వారిపై లైంగికంగా దాడి చేయడం, వారితో లైంగికంగా కోరిక తీర్చుకోవడం.

మరి ఈ రేప్ ఎవరు చేస్తారు ? జనరల్ గా చెప్పాలంటే మగవారు ఆడవాళ్ళపై చేస్తారు.మరి అదే పని ఓ మహిళ పురుషుడితో చేస్తే ? మరి దాన్ని ఏమనాలి ? రేప్ అనాలా లేక ఇంకేదైనా పేరు ఉందా ? దాన్ని రేప్ అనరు "ఫోర్సేడ్ టూ పెనట్రేట్" అంటారు అంటున్నారు లండన్ వారు.ఆంగ్లంలో చెప్పాలంటే "Forced to Penetrate".

లండన్ లో అబ్బాయిల మీద లైంగిక దాడులు, మానభంగాలు పెరిగిపోతున్నాయి అంట.మీరు విన్నది నిజమే.పురుషులపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి.

Advertisement

అది కూడా మహిళలే చేస్తున్నారు.కేవలం లండన్ అనే కాదు, కొన్ని వెస్టర్న్ దేశాల్లో ఇదే పరిస్థితి.

అమెరికాలోని ఒహియో అనే ప్రాంతంలోనైతే మహిళలు పురుషులపై రేప్ చేయడం చాలా ఎక్కువైపోయింది.ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటే మారణాయుధాలతో బెదిరించి మరి అత్యాచారానికి పాల్పడుతున్నారు.

ఇలాంటి రివర్స్ రేప్ గురించి లండన్ లోని ఓ యూనివర్సిటి పరిశోధన మొదలుపెట్టింది.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మగవారిపై జరిగే లైంగిక దాడులు ఎక్కువగా రికార్డుల్లోకి ఎక్కడం లేదట.

అసలు మగవారు మాపై ఇలా దాడి జరిగింది అని చెప్పుకుంటే నమ్మేవారు లేదట.కొన్ని కేసుల్లో సాక్ష్యాలు దొరికినా సరే, వారిని రేప్ కేసు కింద బుక్ చేయడం లేదట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఎందుకు ఇలాంటి లింగ భేదం ? కనీసం రేప్ అనే పదాన్ని కూడా వాడకపోవడం ఏమిటి ? దీనిపై ల్యాన్కేస్టార్ యూనివర్సిటికి చెందిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ "ఇలాంటి కేసులు తక్కువే అయినా, మగవారిపై కూడా మానభంగాలు జరుగుతున్నాయి.మహిళలే ఇలాంటి పనులు చేస్తున్నారు.

Advertisement

కాని సమాజంలో ఉన్న ఒక అపోహ ఏమిటంటే, ఇలాంటి దాడులని పురుషుడు ఆస్వాదిస్తాడు అంటారు.కాబట్టి దాన్ని రేప్ గా పరిగణించకూడదట.

కొత్తగా ఫోర్సేడ్ టూ పెనట్రేట్ అని పేరు పెట్టి కఠిన శిక్షలు వేయడం లేదు.అదే పని మగవారు చేస్తే మాత్రం అందరు ఒక్కటై పోతారు కదా.తప్పు ఎవరిదైనా తప్పే.ఒక అందమైన మగవాడిని చూస్తే స్త్రీలకు కామం పుట్టదా? పురుషుడికి బలం ఎక్కువ, కోపం ఎక్కువ, కాబట్టి రేప్ కాదు అంటున్నారు.ఇలాంటి వితండవాదంతోనే పురుషులపై రేప్ కేసులలో కేవలం 15% మాత్రమే బయటకి తెలుస్తున్నాయి.

" అంటూ లండన్ మగవారి కష్టం గురించి కొంచెం వివరించారు.ఏంటి ఇదంతా నిజమేనా ? నిజంగానే ఆడవారు మగవారిపై అత్యాచారాలు చేస్తున్నారా అని ఆశ్చర్యపోకండి.గన్ ఎక్కుపెట్టి అలాంటి పనులు చేసిన మహిళలు ఉన్నారు ఈ తెల్లవాళ్ళలో.

తాజా వార్తలు