ఏ దిక్కున తలపెట్టి నిద్రించాలి..?

తూర్పు,పడమర,దక్షిణ దిక్కుల లో తల పెట్టి నిద్రించవచ్చు.ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు.

నిద్ర మేల్కొనగానే కుబేర స్థానాన్ని దర్శించుకోవడం అదృష్టకారకం, ధన కారకం.

కనుక దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకోవడం లాభదాయకం అని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

ఏ దిక్కున తలపెట్టి నిద్రించకూడదు ? ఉత్తర దిక్కున తలపెట్టి అసలు నిద్రించరాదు.ఎందుకంటే ఉత్తరదిక్కున తలపెట్టి పడుకున్న వారు లేవగానే దక్షిణ దిక్కును చూస్తారు.

దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు.లేవగానే యమస్థానాన్ని చూడటం మంచిది కాదు.

Advertisement

అందువల్ల ఉత్తరదిక్కుకు తలపెట్టి పడుకోరాదు.సైన్స్ ప్రకారం చెప్పాలంటే మానవ శరీరం అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది.

ఉత్తరధ్రువం అయస్కాంత కేంద్రాన్ని కలిగి ఉంటుంది.రెండు సజాతీయ ధ్రువాల మధ్య జరిగే వికర్షణ వలన మెదడులో రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది.

తద్వారా తలనొప్పి,పీడకలలు,మనశ్శాంతి లోపించడం, చెడు ఆలోచనలు రావటం జరుగుతుంది.కనుక తూర్పు, దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రించడం ఉత్తమం అని చెప్పవచ్చు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు