చివరికి కెసిఆర్ క్షమాపణ

తెలంగాణా శాసన సభలో మంత్రి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యలతో సభ పలుమార్లు సభ వాయిదాలు పడింది.

విద్యుత్ ప్రాజెక్ట్ పై చర్చ జరుగుతుంటే సంబందిత మంత్రి జగదీశ్వరరెడ్డి బదులు ఇవ్వడంలో ఒకింత తడబాటును కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ మంత్రికి అనుభవం తక్కువ కారణంగా బదులీయ లేకున్నారని అన్నారు .

దీనిపై మంత్రి గుస్సా అయ్యారు.అయ్యా నాకు అనుభవం తక్కువో ఎక్కువో ఆంధ్రా నేతల కాళ్ళు పట్టుకుని బూట్లు నాకి మంత్రిని కాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

దీనిపై కాంగ్రెస్ అగ్గిబుగ్గయినంత పని చేసింది.ఒక్కదుటున పోడియం వైపు దూసుకు పోయారు.ఆ వ్యాఖ్యలు రికార్డుల్లోంచి తీసేస్తానని స్పీకర్ చెప్పినా ప్రతిపక్షం సద్దుమణగలేదు.

పలు మార్లు సభ వాయిదాలు పడింది.దీనిపై కెసిఆర్ సభకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో సాయింత్రం కెసిఆర్ సభకు వచ్చి జరిగినదానికి క్షమాపణ చెప్పారు.

Advertisement

అంతటితో కాంగ్రెస్ శాంతించింది .

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు