ప్రభాస్‌కు అమ్మగా ఓకే?

అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికి నిలిచి పోయే అందం శ్రీదేవి.

దాదాపు 20 సంవత్సరాల తర్వాత ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’తో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి మళ్లీ కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ తమిళ సినిమా ‘పులి’లో నటిస్తున్న విషయం తెల్సిందే.

‘పులి’తో పాటు ఈమె హిందీలో ‘మదర్‌’ అనే సినిమాలో కూడా నటించనుంది.బోనీకపూర్‌ ‘మదర్‌’ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

అందుకు సంబంధించిన కథ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈమె తాజాగా ఒక తెలుగు సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు.

టాలీవుడ్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు తల్లిగా రీ ఎంట్రీ ఇవ్వాలని ఈమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.గతంలో ఈమెను రామ్‌చరణ్‌ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటింపజేసేందుకు ఫిల్మ్‌ మేకర్స్‌ ప్రయత్నించారు.

Advertisement

కాని శ్రీదేవి మాత్రం అందుకు ఒప్పుకోలేదు.తాజాగా ప్రభాస్‌ సినిమాలో అమ్మ పాత్రను చేసేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు