త‌మిళ పాలిటిక్స్‌లో షాకింగ్ ట్విస్ట్‌

త‌మిళ‌నాట రాజకీయాలు రోజుకో మ‌లుపు తిరిగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత ఆమె వార‌స‌త్వం కోసం అటు అమ్మ నెచ్చెలి జ‌య‌ల‌లిత‌తో పాటు ఆమె మేన‌కోడ‌లు దీపతో పాటు ప్ర‌స్తుతం సీఎం ప‌న్నీర్ సెల్వం, అన్నాడీఎంకేలో ఇత‌ర సీనియ‌ర్ మంత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సీనియ‌ర్లు పార్టీ ప‌గ్గాల కోసం ప్ర‌యత్నాలు చేశారు.

మ‌ధ్య‌లోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పేరు సైతం వినిపించింది.అమ్మ వార‌స‌త్వం రేసులో ఎంత‌మంది పేర్లు వినిపించినా ఇప్ప‌డు ఫైన‌ల్‌గా అమ్మ నెచ్చెలి వీకే శశికళ నటరాజన్‌ అన్నాడీఎంకే అధినేత ప‌గ్గాలు ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తోంది.త‌మిళ‌నాట చిన్న‌మ్మ‌గా పేరున్న శ‌శిక‌ళ పార్టీ ప‌గ్గాల కోసం తెర వెన‌క పెద్ద మంత్రాంగం న‌డుపుతోన్న‌ట్టు తెలుస్తోంది.130 మంది ఎమ్మెల్యేల‌తో చిన్న‌మ్మ‌కే పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం కూడా జ‌రిగిన‌ట్టు త‌మిళ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.చిన్న‌మ్మ‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఇప్ప‌టికే జిల్లాల వారీగా అన్నాడీఎంకే జిల్లా విభాగాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ అధినాయ‌క‌త్వానికి పంపుతున్నాయి.

జ‌య‌ల‌లిత క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ముందుగా ఆమెకు అండ‌గా ఉన్న‌ది శ‌శిక‌ళే అయినందున ఆమెకే పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని జిల్లా విభాగాలు తీర్మానం చేస్తున్నాయి.ఈ తీర్మానాల వెన‌క శ‌శిక‌ళ తెర‌వెన‌క పెద్ద క‌థే న‌డుపుతోన్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

ముందుగా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌భుత్వాన్ని పూర్తిగా త‌న ఆధీనంలోకి తెచ్చుకునేలా చేయాల‌న్న‌దే శ‌శిక‌ళ ప్లాన్‌గా తెలుస్తోంది.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు