మోడీకి మొదటి షాక్‌ తప్పేలా లేదు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి.గతంలో ఎన్నడు లేనంతగా పోలింగ్‌ జరగడంతో పార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీలో పోటా పోటీగా ప్రచారం చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మరియు బీజేపీలు అధికారం తమది అంటే తమది అంటూ బల్లగుది మరీ చెప్పడం జరిగింది.ఆమ్‌ ఆద్మీ పార్టీకి అధికారం ఇస్తే దాన్ని వృదా చేశారంటూ బీజేపీ విమర్శలు ఎక్కు పెట్టే ప్రయత్నం చేశారు.

అయినా కూడా ఢిల్లీలో ప్రజలు ఆద్‌ ఆద్మీ అరవింద్‌ కేజ్రీవాల్‌ వైపే మొగ్గు చూపినట్లుగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది.కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధించింది.

దాంతో ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి చెందింది.ఇక ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిస్తే మోడీని మరింత బలంగా చిత్రీకరించవచ్చని బీజేపీ శ్రేణులు భావించాయి.

Advertisement

కాని అనూహ్యంగా ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడు.ఢిల్లీ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వ పనితనానికి నిదర్శణం కాదని ముందు నుండే బీజేపీ చెప్పుకొస్తుంది.

ఎన్నికల్లో ఓడి పోతే తానే పూర్తి బాధ్యత వహిస్తానని చూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌ బేడీ ప్రకటించారు.మోడీని కాపాడే ప్రయత్నాలు ఇప్పటి నుండే ప్రారంభం అయ్యాయి.

బీజేపీ నాయకులు ఎంత చెప్పినా, ఏం చేసినా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి మోడీకి మొదటి షాక్‌ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ 35 నుండి 44 స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ప్రముఖ వార్త సంస్థలు తమ సర్వేల్లో పేర్కొన్నాయి.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు