టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్‌.. టీఆర్ఎస్‌లోకి కీల‌క నేత‌..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడు ముందు నిల‌వ‌లేక విల‌విల్లాడుతోన్న విప‌క్ష కాంగ్రెస్‌కు ఇప్పుడు దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గ‌ల‌నుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గులాబీ పార్టీలోకి చేరిపోతున్నార‌ని, ఆయ‌న టీఆర్ఎస్ ఎంట్రీకి ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని టీ పాలిటిక్స్‌లో విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా స‌మాచారం లీక్ అయ్యింది.

ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న‌కు కాంగ్రెస్ అధిష్టానం మంచి ప్ర‌యారిటీయే ఇచ్చింది.ఆయ‌న టీ కాంగ్రెస్‌లో కీల‌క‌నేత‌గా ఉన్నారు.

ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా పార్టీ హైకమాండ్ ఇచ్చింది.అయితే గత కొద్ది రోజులుగా భట్టి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్‌లో తాను ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా గుర్తింపు లేక‌పోవ‌డంతో పాటు ఇక్క‌డ ఓకే సామాజిక‌వ‌ర్గం ఆధిప‌త్యం ఎక్కువ‌వ్వ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు.అటు టీఆర్ఎస్ నుంచి రెడ్‌కార్పెట్ ఉండ‌డంతో ఆయ‌న ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక కేసీఆర్ ఇటీవ‌ల జ‌రిపిన రెండు సర్వేల్లోను మ‌ధిర‌లో భ‌ట్టి విక్ర‌మార్క మ‌ళ్లీ గెలుస్తాడ‌ని తేలింది.కేసీఆర్ స‌ర్వేలో కాంగ్రెస్ నుంచి భ‌ట్టి విక్ర‌మార్కతో పాటు క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే వంశీ చంద‌ర్‌రెడ్డి మాత్ర‌మే మ‌ళ్లీ గెలుస్తార‌ని తేలింది.

ఇక ఖ‌మ్మం జిల్లాలో బ‌లంగా విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్న టీఆర్ఎస్ ఈ క్ర‌మంలోనే భ‌ట్టిని త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని ప్లాన్ చేసి స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది.భ‌ట్టి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేస్తే ఆ పార్టీకి తెలంగాణ‌లో తీర‌ని లోటే అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు