చిరు సినిమాపైనే మొత్తం దృష్టి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ప్రతిష్టాత్మక చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే కథ సిద్దం అయిన ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు దర్శకుడు ఎప్పటిలాగే బ్యాంకాక్‌ వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు.

అక్కడకు వెళ్లి చిరంజీవి 150వ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకుని వస్తాడని ఆయన శిష్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమాకు ముందు నితిన్‌తో పూరి సినిమా చేసే అవకాశాలున్నాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.చిరంజీవితో 150వ సినిమా చేసే అవకాశం వచ్చిన ఈ సినిమాలో ఇతర సినిమాల గురించి ఆలోచించడం అవివేకం అవుతుందని, ఇప్పుడు ఏ సినిమా గురించి ఆలోచన తనకు లేదని పూరి చెప్పుకొచ్చాడు.

నితిన్‌తో సినిమా చేసేది ఖాయమే కాని, అది ఇప్పుడు కాదని, చిరంజీవితో సినిమా పూర్తి అయిన తర్వాతే అంటూ పూరి క్లారిటీ ఇచ్చాడు.ఇక మహేష్‌బాబుతో కూడా పూరి ఒక సినిమా చేయాల్సి ఉంది.

Advertisement

అది కూడా చిరంజీవితో 150వ సినిమా అయిన తర్వాతే అంటున్నారు.నితిన్‌, మహేష్‌బాబులతోనే కాకుండా వరుణ్‌ తేజ్‌, నిఖిల్‌, కళ్యాణ్‌ రామ్‌, మంచు విష్ణు ఇలా చాలా మంది హీరోలతో పూరి సినిమాలు చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

అయితే వాటికి కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు