ఈమెది గొప్ప హృదయం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సింపుల్‌ వ్యక్తి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె వేడుకల్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా ఈమె పొంగిపోదు.తాజాగా ఈమెకు ‘క్వీన్‌’ సినిమాకు గాను జాతీయ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే.

జాతీయ అవార్డు అంటే ఎంతో ప్రతిష్టాత్మకం అయినది.ఈ అవార్డు వచ్చిన ఎవరైనా కూడా ఎగిరి గంతేస్తారు.

కాని కంగనా అలా కాదు.చాలా సింపుల్‌గా అవార్డు వచ్చిన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.

Advertisement

పెద్దగా ఎగ్జైట్‌ కాకుండా వచ్చినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.‘క్వీన్‌’ సినిమాలో తాను పోషించిన పాత్రకు జాతీయ అవార్డు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన కంగనా, ‘మేరీకోమ్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రాకు కూడా అవార్డు రావాల్సి ఉందని చెప్పుకొచ్చింది.

ఆ సినిమాలో ప్రియాంక చూపిన నటన అద్బుతం.ఆమెకు ఈసారి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందని ఆశించా.

కాని తప్పి పోయిందని అంటోంది.తనకే అవార్డు రావాలని కోరుకునే హీరోయిన్‌లు ఉన్న ఈ ఇండస్ట్రీలో మరో హీరోయిన్‌కు అవార్డు రావాల్సిందని కంగనా మాత్రమే చెప్పగలదు అని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

అందుకే కంగనా హృదయం చాలా గొప్పది అని అంటారు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు