రామోజీకి షాక్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో

రామోజీరావుకు తెలిసిన‌న్ని బిజినెస్ కాలిక్యూష‌న్స్ ఎవ్వ‌రికి తెలియ‌వేమో.

టీవీ ఛానెల్స్ అధినేత‌గా, మీడియా మోఘ‌ల్‌గా, నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూష‌న్ అధినేత‌గా, రాజ‌కీయాల‌ను శాసించే వ్య‌క్తిగా, ఫిల్మ్‌సిటీ అధినేత‌గా రామోజీ ప్ర‌తి విష‌యంలో ఓ స్ట్రాట‌జీని ఫాలో అవుతూ దానిని స‌క్సెస్ చేస్తారు.

చిన్న పెట్టుబ‌డి పెట్టాల‌న్న దాని స‌క్సెస్ కోసం ఆయ‌న ఎన్నో లెక్క‌లు వేసుకుంటారు.అన్ని కాలుక్యేష‌లేష‌న్స్ లేకుండా ఏ ప‌ని చేయని ఆయ‌న తాజాగా ఓ విష‌యంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోంది.

అదే ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా.ఈ సినిమాకు మొత్తం రూ.40 కోట్ల బిజినెస్ అయ్యింది.సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ అవ్వ‌డంతో సినిమాకు పెట్టుబ‌డిలో మూడో వంతు రాద‌ని లెక్క‌లు వేస్తున్నారు.

ఓ వైపు సింగం -3, నేను లోక‌ల్, ఘాజీ సినిమాల హ‌వా కంటిన్యూ అవుతోంది.ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను రామోజీ ఏకంగా రూ 11.5 కోట్ల‌కు కొన్నారు.ఈటీవీ పెద్ద సినిమాల శాటిలైట్ రైట్స్ కోసం భారీ పెట్టుబ‌డులు పెట్ట‌దు.

Advertisement

కానీ రామోజీ గ‌తంలో అన్న‌మ‌య్య సినిమాతో భారీ లాభాలు ఆర్జించారు.ఇక నాగ్‌-రాఘ‌వేంద్రుడి శ్రీరామ‌దాసు సైతం తెలుగు టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.

ఈ అంచ‌నాల‌తోనే రామోజీ ఓం న‌మో వేంక‌టేశాయకు ఇంత భారీ మొత్తం పెట్టి శాటిలైట్స్ రైట్స్ తీసుకున్నారు.తీరా ఇప్పుడు సినిమా థియేట‌ర్ల‌లోనే ఆడ‌లేదు.

మ‌రి టీవీలో ఎంత వ‌ర‌కు ఆద‌రిస్తారో చూడాలి.ఏదేమైనా ఓం న‌మో వేంక‌టేశాయ శాటిలైట్స్ విష‌యంలో రామోజీ కాలిక్యులేష‌న్స్ లెక్క త‌ప్పాయి.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు