పన్ను ఎగవేత వివాదం ... ఎన్టీఆర్ స్పందన ఇది

నాన్నకు ప్రేమతో సినిమా రేమ్యునరేషన్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ షోకాజు నోటీసులు అందుకోనున్న సంగతి మీరు ఈరోజు చదివే ఉంటారు.7.

33 కోట్ల పారితోషికాన్ని ఓ లండన్ బేస్డ్ కంపెని నుంచి అందుకున్న ఎన్టీఆర్, ఆ లెక్కల ప్రకారం 1.10 కోట్ల సర్వీసు ట్యాక్స్ భారత ప్రభుత్వానికి చెల్లించలేదు అనేది ఆరోపణ.ఈ విషయం మీద ఎన్టీఆర్ వివరణ కోరుతూ త్వరలోనే షోకాజు నోటీసులు విడుదల చేయనున్నారు.

అయితే ఈ విషయం మీద మీడియా సొంత కథనాలు రాయకముందే, ముందుజాగ్రత్తగా ఓ స్టేట్మెంట్ ని అభిమానుల కోసం విడుదల చేసారు ఎన్టీఆర్."నేడు వార్తల్లో వచ్చిన సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు కథనం పై , ఒక బాధ్యత గల భారత పౌరుడిగా నా స్పందన తెలియజేయటం సబబు అని భావించి, జరిగిన సంఘటనలను వివరించ దలచాను.2015లో "నాన్నకు ప్రేమతో" అనే సినిమా లో నటించిన సంగతి తెలిసిందే.ఇది లండన్ లో నిర్మించిన చిత్రం.పొరుగు దేశం లో అందించిన సర్వీస్ (హీరోగా)కు భారతదేశంలో సర్వీస్ ట్యాక్స్ వర్తించదు అని నాకు చెప్పడంతో, చట్టం ప్రకారమే నేను "నాన్నకు ప్రేమతో" సినిమా నిర్మాతల వద్ద సర్వీసు ట్యాక్స్ వసూలు చేయలేదు.2016 లో, ఇదే విషయం పై CAG నుండి వచ్చిన క్వేరికి లిఖితపూర్వంగా మా ఆడిటర్ లు స్పందించడం జరిగింది.ఆ స్పందన తరువాత, ఎటువంటి అధికారిక ఉత్తర్వులు కాని, నోటీసులు కాని మాకు అందలేదు.

చాలా సంవత్సరాలుగా ఆదాయపు పన్ను మరియు సర్వీస్ ట్యాక్స్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వ్యక్తిని నేను.భారత పౌరుడిగా నా చట్టపరమైన బాధ్యతలను ఎన్నడూ మరువలేదు.ఈ విషయంలో సంబంధిత అధికారుల నుండి నాకు ఆదేశాలు అందితే, నా వైపు నుండి నేను చట్టపరంగా చెల్లించాల్సిన రుసుము ఏదైనా ఉంటే, అణా పైసలతో సహా చెల్లించేందుకు నేను సిద్ధముగా ఉన్నాను.

ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.చట్టానికి ఎలాప్పుడూ కట్టుబడి ఉండాలి అనే నమ్మే నేను, ఈ విషయంలో కూడా అదే పాటిస్తున్నాను" అంటూ ఎన్టీఆర్ అఫీషియల్ స్టేట్మెంట్ చెప్పుకొచ్చారు.

Advertisement
కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

తాజా వార్తలు