పోలిటిక్స్ లోకి నయనతార..?

కొన్ని రోజుల కిందట నయనతార ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి సేలం వెళ్లారు.అక్కడ ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ఐదు వేలకు పైగా వచ్చిన నయనతార అభిమానుల్ని చూసి రాజకీయ వర్గాలు ఆమెపై మక్కువ చూపిస్తున్నాయట .ఆమెను ఎలాగయినా తమ పార్టీలోకి లాగాలని కొన్ని రాజకీయపార్టీలు ఆలోచనలు చేస్తున్నాయని సమాచారం.బీజేపీ, డీఎంకే పార్టీలు నమనతారను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆల్ రెడీ ప్రయత్నాలు మొదలెట్టినట్లు తమిళ వర్గాల సమాచారం.

డీఎంకే పార్టి బెజెపి కన్నా గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట.ఈ విషయంపై ఒక డీఎంకే నేత స్పందిస్తూ " రాజకీయంగా ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చాలా బలంగా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితిలో డీఎంకేకు ప్రచారాస్త్రంగా ఒక పాపులర్ వ్యక్తి అవసరం, సేలంలో నటి నయనతార క్రేజ్‌ను చూసిన తరువాత ఆమెను పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చిన మాట నిజమే, నటి ఖుష్బు వలన పార్టికి చాలా నష్టం జరిగింది, ఇప్పుడామె స్థానంలో నయనతార లాంటి ఒక స్టార్ నటి అవసరం " అని చెప్పారు.అయితే ఈ విషయంపై నయనతార తన స్పందన ఇంతవరకు తెలియజేయలేదు.

Advertisement

వచ్చే ఏడాది నయనతార పెళ్లి చేసుకుంటుందని కుడా వార్తలు వస్తున్నాయి.

వైరల్ వీడియో : విమానంలో కొట్టేసుకున్న ప్రయాణికులు.. చివరకు..
Advertisement

తాజా వార్తలు