మెగా మోతతో సిని'మా' అవార్డ్స్..!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ తరుణంలో అన్ని ప్రసార మాధ్యమాలు ఆయన మీద ఫోకస్ చేశాయి.

ఇక మా టివి ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డుల్లో ఈ సంవత్సరం మెగాస్టార్ చరిత్రతో మోత మోగించేశారు.

స్వయంకృషితో పైకి వచ్చిన శివశంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి ఎలా తన సిని ప్రస్థానాన్ని కొనసాగించాడో ఏవిలతో అలరించారు.అంతేకాదు మెగాస్టార్ ను అనుకరిస్తూ శ్రీకాంత్, నవదీప్, సునీల్, సాయి ధర్మ తేజ్ లు మెగా పాటలకు స్టెప్స్ కూడా వేశారు.ఇక చివరగా మెగాస్టార్ కూడా స్టేజ్ మీద తన కాలు కదిపారు.9 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమా తీస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఓ కిక్ ఇచ్చేలా ఈ ప్రోగ్రాం జరిగింది.చిరు డ్యాన్సులేస్తుంటే తనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తుంది.

సో అలా మొత్తానికి సినిమా అవార్డుల ఉత్సవం మెగా మోతతో దద్దరిల్లింది.ఇక మెగాస్టార్ చిరజీవి 150వ సినిమా రావడమే తరువాయి.

తమిళ కత్తి సినిమా రీమేక్ గా వస్తున్నా మెగా మూవీను వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇక ఆ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తుండటం విశేషం.

Advertisement
ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట

తాజా వార్తలు